జిహ్వ చాపల్యాన్ని కలిగించేవి, ఇంద్రియాలకు వశమై తీసుకునే ఆహారము రాజసిక భోజనము. ఇవి వీర్యవృద్ధికరంగా ఉండి ఇంద్రియాలను చలింపచేస్తాయి.
సాత్విక బోజనము
పండ్లు, తాజా కూరగాయలు, సరైన ఆధ్యాత్మిక విధానములో వండిన భోజనము సాత్విక భోజనము. మనం ధార్మిక వ్యక్తుగా కావాలని అనుకుంటున్నాము. కాబట్టి, యోగ విధానాల అనుసారంగా మనసు మరియు బుద్ధిని, పరమాత్మయందు నిలిపి దివ్య గుణ ధారణ చేయటమే ప్రప్రథమమైనది కాబట్టి మనం సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. మత్తు, ఆవేశము, సోమరితనము, నిద్ర, కామము, భౌతిక ఆకర్షణ వంటి వాటి వలన ఆటంకాలు కలుగకుండా ఉండటానికి, మనసు ఉద్రేకపడకుండా ఉండటానికి, బుద్ధి అలమటించకుండా ఉండటానికి ఈ సాత్విక ఆహారము దోహదపడుతుంది. బుద్ధి పవిత్రంగా లేనప్పుడు, జాగరూకతతో, సమతుల్యతతో, ధార్మికంగా లేనప్పుడు పరమాత్మ నుండి శక్తిని, ఆనందాన్ని బుద్ధి పొందలేదు. అలాగే మంచి- చెడుల మధ్య, సత్యాసత్యాల మధ్య ఉన్న తేడాను గుర్తించలేదు.
కొంచం పరిశీలించుకుంటే, మనసు మరో విధంగా ప్రభావితం అవుతుంది అని ఒప్పుకోక తప్పదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మాంసం తింటాడనుకుందాం, మాంసం తినాలంటే జంతువులను చంపాలి. మనిషికున్న ఈ అలవాటు మంచిదేనా? తప్పకుండా అది మంచి అలవాటు కాదు. కేవలం మనిషి తినటానికి పశుపక్ష్యాదులను చంపడం పూర్తిగా ఘాతుకమైనదే, స్వార్థపూరితమైనదే. అలాగే తాగుబోతులు వారి వ్యాపార వ్యవహారాలను పూర్తిగా మందు ప్రభావంలో ఉండి చేస్తూ ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి లేక ఇతర ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడానికి అలవాటుపడిన వ్యక్తి చెడు అలవాట్లు అనే ఘాటును పెంపొందించుకుంటాడు. స్వచ్ఛమైన బుద్ధిని కలిగి ఉండాలని ఆకాంక్షించేవారు, సద్గుణాలు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు వీటిని తీసుకోరు. ఎందుకంటే ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వారిలో స్వార్థం, కామం, హింసా, వృత్తి, ఇతరుల చెడు సంస్కారాలకు తొందరగా అలవాటుపడటం వంటివి వచ్చి చేరి అవి అతని వ్యక్తిత్వంగా మారుతాయి. అందుకే శివ పరమాత్మ జిజ్ఞాసువులకు ఇలా బోధిస్తున్నారు.- ” మీరు తీసుకునే ఆహారమే కాక, దానిని వండే వారు, సంపాదించే వారు, వడ్డించేవారు అందరూ ధార్మిక సద్బుద్ధిని కలిగి ఉండాలి. ఎందుకంటే కేవలం భోజనం మాత్రమే మనసును ప్రభావితం చెయ్యడమే కాక మనసు కూడా దాని ప్రభావాన్ని ఆహారంపై చూపుతుంది”.
ఆహారం మనసుపై ప్రభావాన్ని చూపుతుంది అని అందరికీ తెలిసినా కానీ మనసు కూడా ఆహారంపై ప్రభావాన్ని చూపుతుంది అని ఎంతమందికి తెలుసు?
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి