మన బండికి బ్రేకు మన్మనాభవ ఆలోచనా సాగరమధనం చేస్తూ – చేస్తూ వుండగా, మన మనస్సు పరచింతనలో, దోషాలలో, దేహాహభిమానములో, లేక అజ్ఞానం వైపు వెళ్ళుచున్నట్లయితే మనం మన్మనాభవ అనే బ్రేకు వేసుకొనాలి. మన ఆలోచనల వేగమును తగ్గించి మనస్సును శివబాబా స్మృతిలో నిమగ్నం చేయాలి. ”నేను ఒక జ్యోతి బిందువును. శాంతి స్వరూప ఆత్మను” ఈ స్మృతి లోపల నిలపాలి. మరియు ఒక్క మారుగా సైలెన్సులోనికి వెళ్ళిపోవాలి. సృష్టి అనే డ్రామా భావి(విధి) కూడా మన ఈ కారుకి హాండ బ్రేక్ వంటిది. ”ఫలానా విషయం జరగుకుండా వుండవలసినది. అది ఎందుకు అయినది? ఇలా జరిగితే బాగుండేది. ఫలానా వ్యక్తి లేక పరిస్థితి నా కిష్టం లేదు. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఆలోచనలు వస్తుంటే డ్రామా” అనే పాయంట్ ను బ్రేకుగా ఉపయోగించాలి. ”ఈ సృష్టియనే డ్రామాలో ఏది జరగవలసి వుందో అదే జరిగింది. ఇపుడు విషయాన్ని విడిచిపెట్టి ముందు జరుగవలసినదాన్‌న గురించి ఆలోచించాలి” అనుకోవాలి.
మన బండికి బ్రేకు గురించి తెలిసింది. దీని స్టార్టర్ నడిపంచే పార్ట్స్(భాగాలు) పద్ధతి ఏది? అది నిశ్చయం, మన నిశ్చయం ఏ విధంగా వుంటే ఆ విధంగా మన బండి నడుస్తుంది. మన నిశ్చయం బాగుంటే బండి బాగా నడుస్తుంది. లేకపోతే త్రోసుకుంటూ ఇతరులు త్రోసూ వుంటే నడుస్తుంది. మన బండికి పెట్రోలు ధైర్యం, సాహసం, ధైర్యం సాహసం లేకపోతే బండి ఆగిపోతుంది. పురుషార్ధం నడవదు. జ్ఞానమే మన కారుకు పెట్రోలు. జ్ఞానమనే పెట్రోలులో చెత్త(కచరా) కలిస్తే, అనగా మానవమతం కలిసినా బండి నడవదు. ఆలోచనా సాగర మధనం కాదు.
మన మార్గం జ్ఞాన యోగాలు. ఈ మార్గమనే పట్టాల నుండి మన ఆలోచనా సాగరమనే బండి దిగిపోతే దానిని మళ్ళీపైకి ఎక్కించాలి. మరియు అజ్ఞానం లేక దేహాభిమానం వైపు మనమధనం వెళ్లిపోతుంటే దానిని మలిచి సన్మార్గం వైపునకు తీసికొని వెళ్ళాలి.
మన బండికి ముందు లైట్లు ప్రజాపిత బ్రహ్మ, జగదంబ సరస్వతి, వాళ్లు ఎలా తమ జీవితాన్ని గడిపారో ఏ మార్గం మనకు చూపారో దేనిమీద మనసును ప్రకాశితం చేసారో దానిని అనుసరిస్తూ మనం మన జీవితాలను మన ఆలోచనా సాగరమధనమనే బండిని నడిపించాలి.
మన బండి వెనుక లైట్ లేక డిక్కీ మనలోని ధారణలు లేక గుణాలు. వీటినే మన వెనుక లైట్స్ వేస్తూ అనగా ప్రకాశింప చేస్తూ ఇతరులను కూడా సావధానంగా చేయాలి. అపుడు మన వెనుక వచ్చేవారికి కూడా దీని వలన జాగ్రత్త లభిస్తుంది. కావున విచార సాగరమధనంలో వెనుక లైట్‌ను మనం వేశామా? లేదా అని ధ్యాస పెట్టుకొనాలి. మన బండికి అద్దం సృష్టి నాటకం యొక్క ఆది మధ్యాంత జ్ఞానం. ఈ జ్ఞానమనే అద్దమే ఆత్మయనే డ్రైవరు యొక్క మూడవ నేత్రం. దీని ద్వారానే మనం వెనుక వచ్చే వారిని చూడగలం. ముందు నుండి వెళ్ళే వారిని కూడా చూస్తూ రక్షణగా నడిపంచగలం.
మన గమ్యంలేక మన లక్ష్య స్థానం ముక్తి – జీవన్ముక్తి. అంతేగాని పరమాత్మలో లీనం కావడం కాని పరమాత్మ కావడం కాని కాదు. ఆత్మ పరమాత్మలో లీనమగుట సంభవమను కొంటే ఊహలో ఫలావు వండుకొనుట వంటిది. ఆత్మ అవినాశి. పరమాత్మ కూడా అనాది అవినాశి. ఒకరు మరొకరిలో లీనం కావడం అసంభవం.
ఆలోచనా సాగరమధనమనే బండిని ప్రారంభించుటకు ముందు ఆత్మయనే డ్రైవరు ముందు లైట్ వెనుక లైట్‌ను చూచుకొనాలి. మరియు బ్రేకులు, అద్దం, సరిగా ఉపయోగించాలి. తమ గమ్యం, మార్గం దృష్టిలో పెట్టుకొని తప్పుమార్గం వైపునకు పోనీయరాదు. దానిని మలచి మంచి మార్గం వైపు తీసికొని వెళ్ళాలి. మనం ఈ విదంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆలోచనా సాగరమధనం చేసినట్లయితే మనకు ఎంతో సంతోషం తప్పక కలుగుతుంది. శక్తి లభిస్తుంది. ధారణ పరిపక్వమవుతుంది. స్థితి పెంపొందుతుంది. మన మనసులో పొరబాటు సంకల్ప వికల్పాలు కూడా రావు. మన పాత సంస్కారాలన్నీ శ్రేష్ఠంగా పరివర్తన చెందుతాయి.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి