Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌.. భయాన్ని తొలగించడం ఎలా? (ఆడియోతో..)

” అన్ని భయాలను, ఆందోళనలను తొలగించడం ఎలా” అన్నదే ఇప్పటి ప్రశ్న. భయం మనిషి రక్తాన్ని పీల్చి అతడిని నిర్జీవంగా చేస్తుంది అని అంటారు. ఆందోళన, చింత అంటే అవి చితి అన్న మాటకు పర్యాయ వాచకము మాత్రమే.
ముందుగా ఏ ఏ విషయాలలో భయాందోళనలు కలుగుతున్నాయో పరిశీలించి ఆవిధమైన పరిష్కారాలను ప్రయోగిస్తే భయాందోళనలు తొలగిపోతాయి. మృత్యు భయాన్ని దివ్య జ్ఞానంతో, ఆత్మ అభిమానంతో పరిష్కరించవచ్చు. కలియుగ మరియు సత్యయుగ సంధి సమయమైన వర్తమాన సంగమయుగంలో మనిషి తన సంపూర్ణ విశ్వాసాన్ని ఒక్క సర్వశక్తిమంతునిపైనే ఉంచాడు అని, ఈ సంగమయుగంలో అతని దశ ఉన్నతి దిశగా వెళుతుంది అని ఆలోచించేంత వివేకము మనిషికి కలగాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement