Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌.. బుద్ధి ద్వారా త్యాగతము (ఆడియోతో…)

ఈ విధమైన త్యాగము అతి కష్టము అని కొందరు భావించవచ్చు. కానీ, నిజానికి దీనిని అతి సునాయాసంగా చెయ్యవచ్చు. సన్యాసుల కర్మలు మాయాజాలం నుండి దూరంగా ఉండేవిగా ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో సుఖ దు:ఖాలు ఉంటాయి కనుక వారు ఈ ప్రపంచాన్ని త్యజిస్తారు. అటువంటి సందర్భంలో, వారు పరమాత్మ గురించి, వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ వివరించే విధానము పరమాత్ముని జ్ఞానముపట్ల మరియు పరమాత్ముని పట్ల అవగాహన కలిగించే విధంగా ఉంటుంది. అర్థం చేసుకుని చేసే ఏ పని కూడా దు:ఖాన్ని కలిగించదు. సన్యాసులు అడవికి పయనమై, హఠయోగాన్ని చేస్తూ, దీర్ఘకాల ఉపవాసాలను ఆచరిస్తూ తమ దేహాలకు కష్టాన్ని కలిగించుకుంటూ ఉంటారు. రాజహంసలా తేజోమయంగా నిష్కళంకంగా ఉన్న వ్యక్తి, మరో విధంగా చెప్పాలంటే ” రాజయోగి” చేసే త్యాగము అతనికి కష్టం కలిగించదు. ఎందుకంటే అతడు వస్తు వైభవాలను, స్థానాలను తన బుద్ధి ద్వారా త్యజిస్తాడు కనుక. ఈ విధమైన త్యాగము ఆకర్షణ, మోహము, ప్రాపంచిక కోరికలను త్యజింపజేస్తుంది. ఈ దృష్టి కోణంతో ఆలోచిస్తే ఇటువంటి త్యాగము కష్టమైనదేమీ కాదు, కానీ ఇది సూక్ష్మమైన విషయము కనుక దీని గురించి తప్పకుండా కృషి చెయ్యవలసి ఉంటుంది. మానసికంగా అన్నింటినీ త్యజించడం ఎలాగో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement