Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌ – పరమానందం (ఆడియోతో…)

మనకు అనేకవిధాలైన ఇంద్రియ సుఖాల జ్ఞానమున్నది. ఆహ్లాదకరమైన వాయుతరంగాల ఆనందంలో తన్మయమగుట, కన్నులతో వింత, కొంగ్రొత్త రంగులను వెదజల్లే వస్తువులను చూచుట, చెవులతో మధురమంజుల సంగీత రవళులు వినుట, జిహ్వాతో ప్రకృతి ప్రసాదించే ఋతుఫలాలను ఆరగించుట మొదలగునవి. కానీ ఈ ఇంద్రియ సుఖాలన్నిటికంటే శ్రేష్ఠమైనది, పరిహాసం కంట కూడా గొప్పది మరొక సుఖమున్నది. అదే పరమానందం.

ఏకాంతంలో మౌనస్థితిలో ఆలోచనలను అంతర్గతంలోనికి మలిచి శాంతి స్వరాలను ఆలకించుట, తరువాత ఆలోచనలను భౌతిక హద్దులకు దూరంగా తీసుకొని వెళ్ళి దివ్యంగా, శాంతిమయులై అతని శాంతిని అనుభవం చేసికొనుట, ప్రేమ స్వరూపులై అతని ప్రేమానుభవం చేసికొనుట, పరమానంద స్వరూపులై పరమానందానుభూతిని పొందుట. ఇదే పరమానందం.

ఈ పుస్తకంలో ఇటువంటి పరమానంద స్థితి అనుభూతికి కొన్ని ఆలోచనలు ప్రస్తుతించబడినవి.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement