Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ”పరమాత్మ అవతరించియే మానవులకు శరణు ఇస్తారు”

పరమపిత పరమాత్మ అవతరించుటకు ఇదే ముఖ్య కారణము. పరమాత్మ కేవలం లోక, పరలోకాల గుహ్య రహస్యం చెప్పుటకే అవతరించరు. అడుగడుగునా సావధాన పరుస్తూ మార్గోపదేశం చేస్తూ, సలహాలిచ్చుటకు స్థూల శరీరంను ఆధారంగా తీసికొంటారు. ఒకవేళ ఆయన సాకార రూపాన్ని ధారణ చేయకపోతే మానవులకు వారి వారి జాతకాలు, పరిస్థితులు, యోగ్యతలు కర్మబంధనాలననుసరించి సర్వోత్తమ సలహా ఎలా ఇవ్వగలగాలి? ఒకవేళ సలహా ఇవ్వకపోతే కర్మ బంధనాలలో చిక్కుకొనిన మనిషి వికర్మలనే అంధకార కూపంలో పడిపోయిన అతడు బయటపడేదెలా? పరమాత్ముని సర్వోత్తమమైన అభిప్రాయం, సలహా (శ్రీమతం) లేకపోతే వికర్మలు తయారవుతూనే ఉం టాయి. ఈవిధంగా ఏనాటికీ అతడు కర్మ బంధన ముక్తుడు కాలేడు.

కావున పూర్తిగా దు:ఖ నివారణ కోసం పాప కర్మల లెక్క ఖాతాలు పరిసమాప్తి చేసికొనుట అవసరం. అతని మతం తీసుకొనుటకు అతని శరణు ముఖ్యంగా తీసుకొనాలి. అతని ముందు సమర్పణం కావాలి అతని పిల్లలుగా తప్పకుండా కావాలి. ఎందుకంటే తండ్రి, ఉపాధ్యాయుడు, గురువే తన పిల్లలకు లేక శిస్‌యుకలు సలహా ఇవ్వగలరు. ఇతరులకు ఇవ్వజాలరు. సాకారు (స్థూల)లైన పిల్లలకు (వ్యక్తాత్మలు) సలహా చెప్పుటకు పరమాత్మ కూడా సాకార స్వరూపంల ధరించుట తప్పనిసరి. అపుడే తన సాకార స్వరూపం ద్వారా ఆదర్శ కర్మలు చేసి చూపించి శ్రేష్ఠ కర్మలు నేర్పగలడు. పరమపిత పరమాత్ముని జ్ఞానమును మానవులే ధరాణ చేయగలరు. కానీ మనిషి కర్మల వికర్మలు కాకుండ, పూర్వ పాప కాతాలు సమాప్తి అగుటకు అన్యబద్ధులగు మానవులు మాయతో మోసపోకుండా ఉండాలంటే సద్దురువు పరమాత్ముని మార్గోపదేశం లభించాలి. ఆ కార్యార్థం పరమాత్మ సాకారంగా అవతరించక తప్పదు.

జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి గల తేడా భక్తులు కేవలం ” ఓ భగవంతుడా! మేము నీ శరణులోనికి వచ్చాము. నీ ద్వారా చెంత నిలిచాము. కృప చూపించు తండ్రీ! పార బ్రహ్మపరమేశ్వరా! దు:ఖహర్తా! అంటూ ప్రార్థిస్తారు, కీర్తిస్తారు. అంతేగాని యదార్థంగా పరమాత్ముని శరణు తీసికొనరు. అతని సలహా ప్రకారం నడవరు. ఎందుక ంటే పరమాత్ముని శరణు లేక అభిమతం పైన శిక్షణ ప్రాప్తించాలంటే ఆయన స్వయంగా ఈ భూమిపై బ్రహ్మ యొక్క సాకార శరీరమును ధరించినపుడే సిద్దిస్తుంది. అపుడే జ్ఞానం తీసుకొన్నటువంటి జ్ఞాని పిల్లలు క్రియాత్మకంగా అతని శరణు తీసికొనుట, ఒడిలోనికి వచ్చుట, అజ్ఞాను వర్తులై ముక్తి జీవన్ముక్తిని పొందుట సాధ్యమవుతుంది.

మానవాత్మలందరూ కర్మ బంధనాలలో చిక్కుకొనినపుడే పరమాత్మ అవతరిస్తారు. ఆ సమయమునే ధర్మాగ్తాని సమయమంటారు. అపుడే పరమాత్ముడు కర్మ బంధనాల నుండి విడిపించి జీవన్ముక్తి, సత్యయుగ సృష్టి స్థాపన చేయుటకు ముక్తి ధామమునకు తీసికొని వెళ్ళుటకు వస్తారు. కావున ముక్తి – జీవన్ముక్తి దాత ఒక్క పరమాత్ముడే, ఏ లౌకిక గురువులు గాని, మత స్థాపకులుగానీ, విద్వాంసులుగానీ కారు. కావున ”మామేకం శరణం వ్రజ” ఇది ఒకే మహా మంత్రం (సర్వోత్తమ సమ్మతి) దీనితోనే సమస్త దు:ఖ నివృత్తి అవుతుంది. ఈ మహామంత్రమే వికారాలనే రోగమును దూరము చేసే ఒకే ఒక సంజీవిని మొక్క పరమౌషధం.

కానీ కొందరు మూర్ఖులు రోగాన్ని దూరం చేసికొనుటకు మందులు వాడకుండా మందు చీటిని వల్లె వేసినట్లు కొందరు తెలివితక్కువ వారు ఈ మహా మంత్రం యొక్క అమూల్యమైన సలహా ప్రకారం నడుచుటకు బదులుగా ప్రతిరోజు ఈ శ్లోకాలనే పఠిస్తూ వుంటారు. ప్రతి నిత్యం ఈ మహా మంత్రమునే వల్లె వేస్తుంటారు. ఉదా:- ”నేను చేరకుంటాను నేను చేరుకుంటాను” అన్నంత మాత్రాన ఏ వ్యక్తి తన గమ్యం చేరుకోలేడు. సన్మార్గంలో నడిచినపుడే చేరుకొనగలడు. అదేవిధంగా పరమాత్మ మేము మీ శరణు అంటూ ఉన్నంత మాత్రాన ముక్తి లభించదు. కావున యిప్పటికైనా పరమపిత పరమాత్మ శివుని శరణు తీసుకొనకపోతే పాపాల మూట తలపైననే ధరించి ఉంటే తరువాత తల పట్టుకొని ఏడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మూటను ఎత్తుకొని ఇప్పటివరకు ఎవరూ ముక్తి ద్వారం చేరుకోలేదు. చేరుకోలేరు కూడా.

- Advertisement -

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement