ప్రపంచములోని దేహధారి మానవులందరికీ దేహాధారంతో పేరు పెట్టబడుతుంది. ఈ జన్మలోని పేరు వచ్చే జన్మలో వుండదు, గత జన్మలో వుండదు. ఈ జన్మలోని తల్లిదండ్రులు గానీ, బ్రాహ్మణులుగానీ శిశువుకు నామకరణం చేస్తారు. ఈ విధంగా దేహం పేరుతోపాటు జన్మజన్మల దేహాల పేర్లు కూడా మారుతూ వస్తాయి. కావున దేహాధారమయిన నామములు నశించేవి. అశాశ్వతమని తెలియుచున్నది. కానీ పరమాత్మ అశరీరి, జనన మరణ చక్రంలోనికి రాడు. కావున అతని పేరు కూడ అవినాశి, అపరివర్తనీయమయినది. నామాతీతుడు కాదు. కానీ నామము అతీతమయినదనవచ్చును. ఆ దివ్యనామమే ”సదాశివుడు” శివుడనగా 1) కళ్యాణకారి, 2) బీజరూపుడు, 3) బిందువు అనే అర్థాలున్నవి. పరమాత్మ సమస్త సృష్టికి సద్గతి దాత, కావున కళ్యాణకారి. బీజము వృక్షానికి మూలమైన విధంగా శివ పరమాత్మ కూడ మానవసృష్టి వృక్షానికి రచయిత పరమాత్మ స్వరూపము ”జ్యోతిర్బిందువు”. ఈ విధంగా శివుడనే నామధేయము యదార్థముగా సార్థకమగుచున్నది.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి