స్మృతి : ”నేను ఆత్మిక శక్తులతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను.”
లక్ష్యం : ప్రతి పని చేస్తూ నేను నా మనోబలంతో విజయషీ పొందాలి.
(కనులు తెరవగానే ఈరోజంతా వచ్చేటటువంటి అనేకమైన విపరీత పరిస్థితులను ఎదుర్కొనాలి. బాధాకరమైన సంఘటనలలో కూడా మనసును సమతౌల్యంగా ఉంచుకొనాలి. అనే ధృఢ సంకల్పం చేయాలి. దీని కోసం నేను సహించాలి. ఎదుర్కొనాలి, పరిశీలించాలి, నిర్ణయించాలి, ఈ శక్తులన్నిటినీ ప్రయోగిస్తూ ధృఢమైన మనోబలం ధృఢవిశ్వాసంతో కార్యవ్యవహారంలోనికి రావాలి. )
చింతన : నేను మాస్టర్ సర్వశక్తిమాన్ ఆత్మను.. ధృఢమైన యిచ్ఛాశక్తి మరియు మనోబలంతో సంపన్నాత్మను.. (ఈ స్వీయ గౌరవమును లోతుగా అనుభవం చేసికొనాలి ).. సర్వశక్తిమంతుడు.. సృష్టినియంత.. జగత్పాలకుడు.. నా తండ్రి.. నేను అతని సంతానమును..అతని సర్వశక్తులకు, గుణాలకు వారసుడు.. శివపితా, నిరాకారుని సంతానమగు నేను నిరాకారి ఆత్మను.. భ్రుకుటి సిం హాసనంలో కూర్చొని నా కర్మేంద్రియాలపై రాజ్యం చేస్తున్నాను.. నేను ఆత్మ ఈ దేహానికి యజమానిని.. నాకు కర్మేంద్రియాలు మంత్రులు.. నేను కంట్రోటింగ్ పవర్, రూలింగ్ పరవర్తో వీటిని నడిపిస్తున్నాను.. ఇవన్నీ నా ఆర్డర్ ప్రకారం నడుస్తున్నాయి.. సర్వపరిస్థితులు నా స్వాధీనంలో ఉన్నాయి.. ప్రతి పరిస్థితినీ సఫలతా పూర్వకంగా దాటుకొనే నేను వియజీ ఆత్మను.. విజయం నా జన్మహక్కు.. విజయమే నా లక్ష్యం..
అభ్యాసం : విజయం నా జన్మ హక్కని రోజంతా అనుకొనంది. స్వయంగా సాక్షాత్తుగా భగవంతుడు నా పరమప్రియమైన తండ్రి. నేనాతని సంతానమును. సర్వశక్తిమంతుడగు భగవంతుడు నాతో ప్రతి క్షణము, ప్రతి అడుగు తోడుగా ఉన్నాడు. ఆయన తోడు వలన నలువైపులా నాకు విజయమే లభించుచున్నది.. అసం భవమనుకొనే పనులు కూడా అతని తోడు అనుభవం ఉన్నందువలన నాకు సంభవమే అగుచున్నది. ఇందులో ఎక్కడా సంశయమును మాటే లేదు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి