Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. నిశ్చింత జీవితానికి సువర్ణ సిద్ధాంతములు (ఆడియోతో..)

స్మృతి : ”భగవంతుడు నాకు తోడున్నాడు”
లక్ష్యం : నేను నిర్భయంగా, నిర్వైరిగా, నిరాకారిగా తయారు కావాలి.
చింతన : నేను ఆత్మను, నాకు సత్యమైన తోడు ఒక్క పిత పరమాత్మయే.. ప్రపంచంలోని వస్తువులన్నీ, వైభవాలన్నీ వినాశి. .. నేను ఆత్మను.అనాది, అవినాశి శక్తిని.. పరమాత్మ శివుడు కూడా అనాది అవినాశి.. శివబాబా నా సఖుడు.. బంధువు,, ఇటువంటి ఈశ్రరీయ స్నేహితుని పొంది .. నేను ధన్యాతి ధన్యమవుతున్నాను.. నా స్తేహితుడు సర్వశక్తిమంతుడు సదా నా తోడుగా ఉంటారు.. నా బుద్ధియనే చేయి సదా అతని చేతిలో ఉంటుంది.. నా తోడైనవాడు సదా నిర్భయుడు.. నిర్వైరుడు.. నిరాకారి.. అతని తోడుగా ఉంటూ నేను కూడా.. నిర్భయంగా, నిర్వైరంగా తయారవుతున్నాను.. సదా పరమాత్మ స్నేహితునితో నాకు ఆంతరంగిక సంబంధం ఉంది.. నేనెక్కడికి వెళ్లితే అక్కడ ఆయన నా తోడుగా ఉంటారు.. నా సే ్నహితుడు నా ముందు నడుస్తూ నాకు సత్యమార్గ దర్శకుడయ్యారు.. దానిపైననే నేను నడుస్తున్నాను..ఆయన వెనుక నడుస్తూ నా ప్రతి కష్టంలో రక్షిస్తున్నారు.. ఆయన తోడుతో నా ప్రతి అడుగులో సఫలతయే సఫలత ఉన్నది.. ఓం శాంతి..

అభ్యాసం : రోజంతా ప్రతికార్యం చేస్తూ అతని తోడు యొక్క అనుభవం చేసికుంటూ నడవాలి. అతని సలహా తీసుకుని ప్రతి పనీ చేయాలి. మీకు వారి సలహా టచింగ్‌ రూపంలో లభిస్తున్నట్లు మీరు అనుభవం చేసికుంటారు. ప్రతి సమస్యకు సమాధానం లభిస్తుంది. ఎవరి తోడుగా స్వయం భగవానుడున్నాడో అతనిని ఏ తుఫానులు, సుడిగుండాలు ఏం చేస్తాయి? ఈ విషయాన్ని యదార్థంగా మీరు అనుభవం చేసుకుంటారు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement