Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. నా పునాది గట్టిగానే వుంది సమయం వచ్చినపుడు ఎదుర్కొంటాను (ఆడియోతో…)

చాలా సార్లు మానవులు ” నా బుద్ధిలో జ్ఞాన పునాది బాగానే వుంది. దృఢంగానే వుంది. జ్ఞాన రహస్యాలన్నీ గ్రహించే ఉన్నాను. నాకు అన్ని పద్ధతులు, నియమాలు తెలుసు. సమయం వచ్చినపుడు సరి చేసుకొంటాను. నాలోని లోపాలు పూర్తి చేసికొంటాను”. అని ఆలోచిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది కూడా వారి వ్యతిరేక సంకల్పాలే. లోపం పూర్తి చేసికొనుటకు ఏ సమయం వస్తుంది. ఏ ఘడియ గురించి మనం ఎదురు చూస్తున్నాము? గడిచిపోయిన ఘడియలు మళ్ళీ వస్తాయా? మనకు మన జీవితం ఘడియలపై విశ్వాసం ఉందా? ఉంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో చెప్పండి?

ఒకవేళ ఈరోజే మన ప్రాణాలు పాయాయనుకోండి. లేక ఏ దుర్ఘటనలోనో మనం దేహాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందనుకోండి. అపుడు మన గతి ఏమిటి? తరువాత ఈ సంగమయుగ జీవితంలో మనం ఎన్నాళ్ళనుండి సమయం తీసుకొని పవిత్రంగా ఉన్నామో, ఎంత ఎక్కువ సమయం నుండి మనం దివ్య నియమాల పాలన చేస్తూ వచ్చామో ఆ సమయానికే మనకు ఫలం లభిస్తుంది. పది సంవత్సరాల నుండి పవిత్రంగా ఉన్నవాడు. ఈ రోజు నుండి పవిత్రంగా ఉన్న వాళ్ళు సమానమని కాదు. పది సంవ త్సరాలుగా అనేక పరిస్థితులను ఈశ్వరీయ నియమపూర్వకంగా ఎదుర్కొన్న వాళ్ళు విఘ్నాలను జ్ఞానయుక్తమైన పద్ధతితో దాటుకొనిన వారికి ఈరోజు నుండే పురుషార్థం చేస్తున్న వారికి ఒకే ఫలం లభిస్తుందా లేదు. కాబట్టి మా బుద్ధిలో జ్ఞానబీజం పడే వుంది మా నిశ్చయము పునాది బలంగా వుంది. మాకు ఫలాన పరిస్థితులు బా మేము పురుషార్థం చేయం మొదలు పెడతాము” అనునది తప్పు మాట. చిరకాల అభ్యాసంతోనే యోగస్థితి కూడా పరిపక్వమవుతుంది. తరువాత తలపై వినాశన కాలం వచ్చేస్తుంది. అపుడిక ఏమీ తయారు కాలేరు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement