మత్తెక్కించేవి, కడుపులో మంట పుట్టించేవి, మగ్గిపోయినవి, ఘాటైనవి, భారాన్ని కలిగించేవి, కుళ్ళిపోయినవి, సులువుగా జీర్ణం కానివి, నిద్రను సోమరితనాన్ని కలిగించేవి, మాంసము, చేప, కోడిగ్రుడ్లు, వెల్లుల్లి, ఉల్లి, మొదలైనవి తామసిక భోజనము. మద్యం మరియు పొగ త్రాగడం కూడా ఈ కోవకు చెందినవే. ఇవి మనిషికి పతనాన్ని కలిగిస్తాయి. యోగాభ్యాసం చేసే వ్యక్తికి, భగవంతునిపై మనసును నిలుపదలుచుకున్న వ్యక్తికి ఇవన్నీ పెద్ద ఆటంకాలుగా నిలుస్తాయి.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి