మనస్థితిలో బలహీనతలు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఉదా:- మనలను సావధాన పరిచేవాళ్లు లేకపోవుట మన లోపాలు చెప్పి మరల మనస్థితిని సరిగా చేసే ఆదేశ నిర్దేశాలిచ్చి అదుపాజ్ఞలలో పెట్టే సన్నిహితులండరు. మనస్థితి సంపూర్ణంగా, నిర్దోషంగా తయారు కానంత వరకు తప్పకుండా అతనికి ఎవరో ఒక నిర్దేశకులండుట అవసరం. వారి ఉన్నతి కోసం వారికి హితోపదేశం చేసేవారు కావాలి కానీ చూడబోతే కొంచెం ఈశ్వరీయ జ్ఞానం విన్న తరువాత ఈశ్వరీయ సేవలో కొంచెం నిమగ్నమైన తరువాత ఏ మంచి సాంగత్యం ఉంచుకొనరు. ఎవరికీ తమ స్థితి గురించి విడమరిచి చెప్పరు. దాని వలన తమ దోషాలు తాము చూచుకోలేరు. వాటిని దూరం చేసుకొనలేరు. ఇలాంటి పరిస్థితి చూచి వారికి ఏప్రగతి సాధించలేక సోతున్నామనే నిరాశ కలుగుతుంది. తనలో తాను ఎక్కడున్న వాడిని అక్కడే ఉన్నాను” అనుకొంటాడు. కావున ముందు ఉన్నతి కోరుకొనేవారు తమ పురుషార్థంలో తీవ్రత తీసుకొని వచ్చుటకు తన స్థితి యొక్క చార్టు ఇవ్వడం చాలా అవసరం
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి