Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌ – చదివించే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో నాల్గవది ‘చదివించే కళ ‘

4. చదివించే కళ :
ఆది పితయగు బ్రహ్మాబాబా తన ప్రవర్తన, స్నేహమయమైన ఆత్మికదృష్టి, వృత్తి వ్యవహారంలో అందరినీ తమవారుగా భావించే పాఠాలు నేర్పేవరు. విద్యకళ యొక్క సారమే ప్రేమపూర్వకమైన వ్యవహారం సంత్‌కబీర్‌దాసు కూడా ”ఎన్ని చది వినా పండితుడు కాడు ప్రే మయనే రెండక్షారాలు చదివిన వాడే పండితుడు” అన్నాడు. ఈ విద్యలో ఎన్నో విషయాలున్నప్పటికి ఒకే విషయం బోధిస్తున్నట్లుగా, కధా రూపంలో చదివించే వారు. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య గాఢానురాగం ఉండేది. ఎవిరికైనా శిక్షణ ఇవ్వాలనుకొంటే వ్యక్తిగతంగా చెప్పేవాడు. అందరిముందు మహిమచేసేవాడు. దీనివలన వాళ్ళు స్వాభిమానులై తమ్ముతాము మార్చుకొనేవాళ్ళు శ్రీ కృష్ణుడు రధంలో కూర్చుని అర్జునునికి బోధించుట చదివించే కళకు ఒక నిదర్శనం.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement