Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. గృహ వాతావరణం (ఆడియోతో..)

స్వయాన్ని పరమాత్ముని సంతానంగా భావిస్తూ దైవీ పరివారపు సభ్యుడిగా నమ్ముతూ ఒక యోగి తన ఇంట్లో శివ పరమాత్ముని చిత్ర పటాన్ని శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణులు, శ్రీ సీతా రాముల వంటి దేవతల చిత్ర పటాలను పెట్టుకోవడం ద్వారా అతడు సతోప్రధానమైన ఆధ్యాత్మిక వాతావర ణాన్ని ఏర్పరుచుకుని ఆశ్రమ వాతవరణాన్ని, మందిరాన్ని తలపింపజేసే వాతావరణాన్ని తన ఇంటిలో ఏర్పరుచుకోగలడు. ఈ చిత్రాలు అతనికి నిరంతరం తాను దైవీ వంశస్థుడనని, పరమాత్ముని సంతానమునని చెబుతూ ఉంటాయి. దివ్యమైన లక్ష్యం కలిగిన వ్యక్తి హానికరంగా, కామ వాంఛతో వ్యవహరించడు. దేహాభిమానాన్ని రెట్టింపు చేసే అసభ్యకర చిత్రాలన్నీ అతడు స్వతహాగానే తన ఇంటి నుండి తీసి వేస్తాడు.
కనుక,నిజమైన యోగిగా కావాలనుకుంటే వారు తమ ఇంటిని ఒక మందిరంలా భావిస్తారు. పైన వివరించిన విధంగా చెయ్యనంత కాలం కామ వికారము ఇతడిని గురి చూసి దాడి చేస్తూనే ఉంటుంది. మనం స్వర్ణ మక్కుటంతో మరియు పవిత్రతా కిరీటం కలిగి ఉన్నట్లుగా ఒక ఫోటోను కూడా తీసుకుని మన వద్ద పెట్టుకోవచ్చును. పవిత్రత ద్వారానే స్వర్గ దైవీ రాజ్యము ప్రాప్తిస్తుంది అని ఈ చిత్రము మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. పవిత్రతకు దూరమై ఒకవేళ కామ వికారానికి లోనైట్లయితే దైవీ రాజ్యాన్ని పోగొట్టుకుని భగవంతుని దర్బారులో అనగా ధర్మరాజుపురిలో శిక్షలు తినవలసి ఉంటుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement