Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఉదయం లేచే విధి విధానం

ప్రాత: కాలంలో లేవగానే మొదటి సంకల్పం మనస్సున కళ్ళ ఎదురుగా అన్నిటికంటే మొదటి దృశ్యం. బుద్ధిలో ప్రధమంగా పరమపిత శి పరమాత్మ స్మృతియే రావాలి. మంచం మీద నుండి లేచి యోగంతోటే తన దినచర్యను ప్రారంభించాలి. మరియు తన మస్సులో ”ఈరోజు దినచర్య, మనోస్థితి నిన్నటికంటే చక్కగా పెట్టుకుంటాను. ఎవ్వరినీ దు:ఖపెట్టను. అని ప్రతిజ్ఞ చేసికొనాలి. ప్రాతం కాలంలో మన మానసిక స్థితి సతోగుణిస్థితిలో చురుకుగా, ఆనందంగా, సంతుష్టిగా వుంటుంది. ఆ సమయంలో ప్రతిజ్ఞ చేయుట అంటే శుభ సంకల్పం తీసికోవడమంటే కర్మక్షేత్రానికి దిగుటకు ముందుగా మనోబలానికి చాలా లాభదాయకమైన మార్గం చూపుట వంటిది. మనిషి ఆలోచనలను బ్టటియే ఆచరణ అనేది ఒక సూక్తి. ఉదయం సమయంలో ఎలాంటి ఆలోచన తీసికొంటే అలాగే తయారవుతారు. కావున తన పురుషార్థంలో తీవ్రత తీసుకొని వచ్చుటకు కృత నిశ్చయ సంకల్పంతోనే తన పాదాలను మంచం మీద నుండి భూమి మీదకు పెట్టాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement