తేనె లేక వెన్నలో ఒక అద్భుతమైన తియ్యదనం ఉంది. వాటిలోని పోషక గుణాలను ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ వాటి వైపుకు ఆకర్షితమవుతారు. అలాగే, తియ్యని మాటలను వినడానికి కూడా మనుషులు తపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఎంతో మనోహరంగా, శక్తిదాయకంగా ఉంటాయి కనుక. అందుకే విశ్వపిత అయిన శివపరమాత్మ ఇలా అంటారు.- ” మీకు వీలైనంత మధురంగా ఉండండి” . మధురత ప్రేమను కలిగించి ఐకమత్యాన్ని పెంపొందించి తద్వారా సుఖ శాంతులను కలుగజేస్తుంది. మధురభాష, మానసిక ప్రశాంతత లేని చోట ఘర్షణ ఉంటుంది.
మనసులో చెలరేగే అలజడులు ప్రకృతి సృష్టించే భీభత్సంకన్నా తక్కువేమీ కావు. పరుష భాష వల్ల కలిగే బాధ రాళ్ళ వల్ల కలిగే నొప్పికన్నా తక్కువయినదేమీ కాదు. కనుక, సుఖమయ జీవితాన్ని గడపడానికి, ఇతరుల జీవితాలను సుఖంగా కొనసాగించుటకు ప్రశాంతత, మధురత గుణాలు అత్యవసరము.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
బ్రహ్మాకుమారీస్.. ఇవి ఒక మందులా పనిచేస్తాయి (ఆడియోతో…)
Advertisement
తాజా వార్తలు
Advertisement