Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఇది సహజ మార్గం దీనికి సరియైన అర్థం (ఆడియోతో..)

శివబాబా అనేక మార్లు ఈ రాజయోగం సహజమార్గమని బోధించారు. చాలామంది అవగాహన సరిగా లేనందు వలన మనం ఏ కష్టాల్లో పడరాదన్న భావం తీసికొంటారు. మనం ఈశ్వరీయ సేవ చేయాల్సి వస్తే అందులో ఆకలిదప్పికలు సహించాల్సి వస్తుంది. నిద్రను త్యాగం చేయాలి. అనేక కష్టాలపాలు కావాలి. లౌకిక సౌకర్యాలు లేకుండా పని చేయాలి. ఎంత అలసిపోయినా పని చేయాలి. ఇవన్నీ చూచి వాళ్ళేమనుకొంటారంటే” మనం పనులు చేయావల్సిన అవసరం లేదు ఎందుకంటే మాది సహజమార్గం. మాది హఠయోగ మార్గం కాదు” అని భావిస్తారు. అలాగే ”ఈశ్వరీయ స్మృతి యాత్రలో కూడా అవకాశం, వీలు, వసతి లభించనపుడే కదురుతుంది” అని ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొనుట వలలనే ఆత్మలో బలం నిండుతుంది. సహజ మార్గమనుటలో గల భావం తెలిసి తెలిసి ఆకలితో ఉండటం ప్రాణాయామాలు, హఠయోగాలు మొదలగునవిచేయనవసరం లేదని, అంతేగాని సేవాకార్యాలు చేయకుండా హాయిగా విశ్రాంతి ప్రియులుకమ్మని కాదు. ఇక్కడ మనం సుఖభోగభాగ్యాలలో విలాసంగా విశ్రాంతి అనుభవిస్తూ ఉంటే భవిష్యత్త్తులో మనకేం ప్రారబ్థం లభిస్తుంది. ఇక్కడ మనం నిరాడంబరంగా శ్రమ జీవితం గడపాలి. ఈ విషయాన్ని ధ్యాసలో నిలుపుకొని ప్రతి పరిస్థితిలో ఈశ్వరీయ స్మృతి యాత్రలో ఉండే పురుషార్థం చేయాలి. ”ఫలాన సమస్య పరిష్కారమైతే మనం ఈశ్వరీయ స్మృతిలో ఉండగలం, ఫలానా వీలు వసతులుంటే ఈశ్వరీయ సేవ చేయగలం” అని మనం ఆలోచించరాదు. ఇలా ఆలోచించుట కూడా సోమరితనం మరియు నిర్లక్ష్యం యొక్క సూక్ష్మ రూపాలే.

ఒకవేళ శారీక రోగాలుగానీ మరే ఇతర కారణాలు గానీ ఉన్నప్పటికీ ”మనం ఈశ్వరీయ స్మృతియాత్రలో ఉందాము, తనువుతో కాకపోతే, మనసుతో, ధనంతో, వాక్కుతో, కొద్దిగానైనా కర్మలను చూస్తూ ఈశ్వరీయ సేవ చేస్తూ వుందాము. ముందు ముందు ఏవైన రోగాలు, కర్మభోగాలు, బలహీనతలు, దుర్ఘటనలు ఏమైన క్లిష్ట పరిస్థితులు రావచ్చు మనకేం తెలుస్తుంది” అని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అన్ని విధాలుగా తమ జీవితాన్ని తామే సఫలం చేసుకొనే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇపుడు నిర్లక్ష్యంగా ఉండే , సోమరితనానికి లోబడే, సమయం కాదు – కానే కాదు.
బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement