Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఇతరులలోని లోపాల పట్ల సరైన అవగాహన (ఆడియోతో…)

ఇతరులలోని లోపాలను, బలహీనతలను సహించ లేకపోవడం కూడా కోపానికి గల కారణాలలో ఒకటి. ఈ పరిస్థితిలో ఇతరుల లోపాలను చూసి ఆశ్చర్యపడే బదులు మనలోని కోపము అనే అలవాటును చూసుకుని దానిని ఎలా అధికమించాలి అని ఆలోచించుకోవడం ఉత్తమం. ఇతరులు ఏదైనా పొరపాటు చేసినా లేక ఒక విషయాన్ని అర్థం చేసుకోలేని కారణంగా ఆ విషయాన్ని ఖండించినపుడు మనం సహానుభూతితో, శుభ భావనతో, యుక్తిగా వారికి మన ఉద్దేశ్యాన్ని వివరించడం ద్వారా మాత్రమే మనం వారికి మన అభి ప్రాయాన్ని తెలియపరచగలం. ఈ విధంగా మనం మన ఆధ్యాత్మిక శక్తిని, ప్రశాంతతను పెంచుకోవడమే కాక ఎదుటి వ్యక్తికి సరైన మార్గాన్ని బలహీనతనే అధిగమించలేనప్పుడు ఇతరుల లోపాల గురించి అతడు ఎలా ప్రశ్నించగలడు? బలహీనతలు కలిగిన వ్యక్తి పట్ల అసహనం ప్రదర్శించడానికి బదులుగా అతనికి సహాయం చెయ్యి అని ఈశ్వరీయ జ్ఞానం బోధిస్తుంది. ఒక బావిలో పడిపోయినట్లుగా లోపాలు అనే అగాధంలో పడిపోయిన వ్యక్తికి ఆధారంగా నిలిచి పైకి లేపండి. లేకపోతే ఏదో ఒక రోజు మనమూ ఆ వ్యక్తి వలె అగాధంలో పడిపోతాము. ఇతరుల లోపాలను మనం భరించలేనప్పుడు మనం మనలోని కోపాన్ని పోగొట్టుకోవడం ఎంతైనా అవసరం. లేకపోతే, కఠినమైన ప్రవర్తనా శైలిని కలిగినవారిలా మనమూ బాధపడాల్సి వస్తుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement