ఇతర వ్యక్తుల కారణంగా కలిగే భయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇతరులు తనకు హాని తలపెడ్తారేమో అని లేక తనకు నష్టం కలిగిస్తారేమో అన్న ఆలోచన భయాన్ని కలిగిస్తుంది. దివ్య గుణాలు లోపించిన కారణంగా ఇటువంటి భయం కలుగుతుంది. దివ్య గుణాలున్న వ్యక్తితో అతి కొద్దిమంది అసంతృప్తి చెందుతారు. ఒక వేళ అటువంటి వ్యక్తితో ఎవరైనా శత్రుత్వంతో ఉన్నాకానీ ఆ వ్యక్తిలోఉన్న దివ్య గుణాల కారణంగా అతడికి స్నేహితులుగా మారిపోతారు. తన సత్ప్రవర్తనతో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొని, కలసిమెలసి పని చేస్తాడు. అంతేకాక అవసరమైతే తన ప్రాణాలను త్యాగం చెయ్యటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. తనలోని సహనము, వినయము, సంతోషము, యోగము, సన్నిహితత్వము, పరోపకార గుణము, సేవా భావము తనపై వైరము పెంచుకున్న వారిలో కూడా పరివర్తన తీసుకువస్తుంది. అని అతడు విశ్వసిస్తాడు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి