ఇతరుల లోపాలను ఎంచడం చాలా చెడ్డ అలవాటు. తప్పులెంచువారి అహంకారం ఇక్కడ బయటపడుతుంది. ఎదుటివారిలోని లోపాలను ఎంచడం, చాడీలు చెప్పడం విమర్శించడం, పరిహసించడం వలన విమర్శలకు గురైన వ్యక్తి బాధను చిరాకును అనుభవించడమేకాక విమర్శించిన వ్యక్తి నోటిలో కూడా విమర్శ అనే వికారపు చేదు ఉంటుంది. దీనిని ఒక ఉదాహరణలో పరిశీలిద్దాం.
ఉదాహరణకు ‘ఎ’అనే వ్యక్తి స్వాభావికంగా మోటుగా, పొడిగా ఉండే వ్యక్తి. అతడిని ఏ సహాయం అడిగినా ‘వీలు కాదు’ అని చెబుతూ ఉంటాడు. ‘బి’ అనే వ్యక్తి ‘ఎ’ అనే వ్యక్తిలోని ఈ గుణాన్ని గుర్తించి దాని గురించి ఆలోచిస్తున్నాడు. ‘ఎ’ లోని ఈ నిరాకరించే గుణాన్ని, పొడి పొడిగా వ్యవహరించే గుణాన్ని చూసి ‘బి’ ఎంతో బాధపడుతూ, అశాంతిపాలవుతూ ఉంటాడు. ఇటువంటి గుణాలు కలిగి ఉంటే వచ్చే పర్యావసానాలు ‘ఎ’ కు తెలిపి అతడిని మార్చాలి అని ‘బి’ అనుకుంటాడు. దీని కోసం ‘బి’ అనే వ్యక్తి తన మానసిక ప్రశాంతతను కోల్పోయి తన ఒడంబడకలో ఓటమి పాలవుతాడు. ‘బి’ అనే వ్యక్తి తన మానసిక ప్రశాంతతను కోల్పోయి తన ఒడంబడికలో ఓటమి పాలవుతాడు. ‘బి’ అనే వ్యక్తి సహజంగా సంతోషంగా ఉండక అలసిపోయి, చికాకుతో, అవిశ్రాంతంగా ఉంటాడు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి