Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ”ఆలోచనలనే బండికి బ్రేకు, లైటు, యాక్సిలేటర్‌” (ఆడియోతో..)

ఆలోచనా సాగర మధనం యొక్క పద్దతి మరియు సిద్ధిగురించి మేము పైన వివరించాము. ఆలోచనలు నడిపించుట ఒక మోటరు కారును నడిపించుట వంటిది. ఒక వ్యక్తి కారును నడిపిస్తున్నపుడు అతనికి బ్రేకు వేయుట గాని, బండిని మలుపు త్రిప్పుట గాని రాకపోతే, ఆ వ్యక్తి యొక్క ఆ కారు యొక్క పరిస్థితి ఎలా వుంటుందో మీరే చెప్పండి? బండిని త్రిప్పే స్థానంలో త్రిప్పలేకపోయినట్లయితే అతడు ఎలా పనికి వస్తాడు? వెనుక వచ్చే బండ్లను గురించి గాని, మరియు కారుకు పెట్టబడిన అద్దాల ప్రయోజనముగాని తెలుసుకొన లేకపోతే అతని గతి ఏమి అవుతుంది?

ఈ శరీరం అనేది ఒక మోటారు కారు వంటిది ఆత్మ దాని యొక్క డ్రైవర్‌. డ్రైవర్‌కి దీనిని ఉపయోగించే విధానం కూడా తెలియాలి అని మనం చెప్పుతున్నాము కూడా. ఎవరైనా ఆలోచనా సాగర మధనం చేయటానికి కూర్చుని ఏదో ఒక జ్ఞాన బిందువును తీసుకొని దాని మీద పరిశోధన చేయుటకు కూర్చుంటారు. కాని అతని పూర్వపు చెడు స్వభావాల వలన అతనిలో అశుద్ధమైన ఆలోచనలు నడుస్తున్నందు వలన దానిలోనే మనస్సు కొట్టుకునిపోతూ వుంటే అతనికి నష్టమే గాని లాభం కలుగదు. కాబట్టి ఆ సమయంలో ఆలోచనలను మలచాలి. అశుద్ధమైన ఆలోచనలకు బ్రేకు వేసి శుద్ధమైన ఆలోచనలను ప్రారంభించవల సి వస్తుంది. లేకపోతే దుర్ఘటనలు సంభవిస్తాయి. అనగా మన మనస్సు అశాంతి పాలవుతుంది. మూడ్‌ పాడవుతుంది. ఆరోగ్యం పైన కూడా చెడు ప్రభావం పడుతుంది.

కావున మన మోటారు కారు బ్రేకు ఎలాంటిది? బ్రేకు ఎప్పుడు వేయాలి? అనే విషయాలు గ్రహించాలి. మరొక విషయం కారులో స్టీరింగ్‌ ఎలాంటిది? మనం దానిని ఎక్కడ ఎప్పుడు ఎట్లా త్రిప్పాలి? అవి కూడా తెలుసుకోవాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement