ఇపుడు దేశము, సమాజము మరియు ప్రపంచ సమస్యలతో ఈ మహావాక్య సంబంధాన్ని జోడించండి. దేహ దృష్టిని విడిచి ఆత్మిక దృష్టిని అవలంభించుట వలన మనం అందరితో
సోదర సంబంధం చక్కగా కలుపుకొనవచ్చు. ఈనాడు హిందు – ముస్లి ం – సిక్కు- క్రైస్తవులలో గల తగాదాలు, గుజరాతీ, మహారాష్ట్రీయులు మొదలగు జాతి మత భేదాలు, కలహ క్లేశాలు ఇవన్నీ పరస్పరం ఆత్మిక స్నేహంతో ఆత్మిక దృష్టితో, సమాప్తి చెందుతాయి. ఎందుకంటే ఆత్మ స్వరూపంతో అందరూ ఒకే దేశం (పరంధామం) నుండి వచ్చారు. మరియు అందరికి ఒకే ఒక పరమపిత పరమాత్మయే తండ్రి కావున అందరూ సోదరులు. అందరి ఆత్మిక ధర్మం పవిత్రత మరియు శాంతి. అందరి భాష ఆత్మిక సైలెన్స్ ఆత్మిక దృక్పధంతో ఉండుట చేత బ్ర హ్మచర్యంలో ఉండగలరు. ఈ విధంగా జనాభా నియంత్రణ కూడా జరుగుతుంది. ఈనాడు ప్రపంచంలో భ్రష్ఠాచారం, కల్తీ, హింస మొదలగు దు:ఖానికి హేతువైన వన్నీ ఈ మహావాక్యానుసారం వ్యవహిరంచుట చేత నివారించబడతాయి.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి