ఈ భౌతిక ప్రపంచంలో జీవితాన్ని గడపటానికి విద్య అవసరము. అయితే జీవితాన్ని విజయవంతం చేసికొనడానికి, ప్రతి క్షణాన్ని నిత్య నూతనంగా అనుభవించటానికి, ప్రతి నిమిషాన్ని ప్రశాంతంగా గడపటానికి ఆత్మజ్ఞానం ముఖ్యం.
”నిన్ను నీవు తెలుసుకో” అన్న ప్రబోధంతో ఉత్తేజితులై ఎందరో ప్రయాణం చేశారు. ఈ భౌతిక ప్రపంచంలో తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొనటంలో ఈ అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ జీవితములో ఆధారాన్ని గుర్తిచాలని ఎందరో ఎన్నో ప్రదేశాలు గాలించారు. ఎన్నో దూరాభారాలు సహించారు.
ఇంత జరుగుతున్నా ఈ నాటి ప్రపంచ ప్రజలు అనాధులుగానే ఉండిపోతున్నారు. వారు వారి తండ్రిని మరచిపోయారు. తమను తామే విస్మరించారు. ఆత్మజ్ఞానం ఒక్కటే ఈ సత్యాన్వేషణకు చేర్చే మార్గము. నిరంతర సత్యప ధం. ఆధ్యాత్మిక చైతన్య భూమికలను అధివహించటానికి పరమాత్ముని అనుభూతికి తెచ్చుకొనుటకు అది ఒక్కటే శరణ్యం. భగవంతుడు ఉన్నతులలో కెల్లా సర్వోన్నతుడు. ఆయన స్ఫురణ సర్వోన్నత విద్య. భగవంతుడు జ్ఞానసాగరుడు. ఆయనను తెలుసుకొన్నవాడు అన్నీ తెలుసుకొన్నట్లే. ఆత్మానుభూతికి ఉన్నతోన్నతమైన పౌరలౌకిక తండ్రి అయిన పరమాత్మను అనుభూతి చేసుకోవాలి. ఇదే అత్యున్నతమైన విద్య.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి