లౌకిక యాత్రలో ఎంతెక్కువ నడిస్తే అంత అలసి పోయినట్లు, ఎంతెంతపైకి ఎక్కుతూ ఉంటే గమ్యం చాలా దూరంగా కఠినంగా అనిపించినట్లుగా ఈ ఆధ్యాత్మిక యాత్రలో కూగా వుంటుంది. ఈ యాత్రలో నడవడం అంటే ఉన్నత గమ్యంలో వెళ్ళుతూ వెళ్ళుతూ కొన్నాళ్ళు తరువాత అలసట, కష్టం అనిపిస్తుంది వాటిని మనసులో పెట్టుకుని విఘ్నాలను ఎదుర్కొనే ధైర్యం విడిచి పెడ్తారు. ఆ జీవితంలో నీరసత్వం అనిపించగానే నూతనత్వం, ప్రగతి, అతీత్వం చూడజాలక నిరుత్సాహపడిపోతారు. కానీ అలా కావద్దు, అనేకానేక విఘ్నాలు, కష్టాలు, గమ్యాన్‌ఇ సమీపించే గుర్తులని, శిఖరాన్ని చేరుకొనే గుర్తులని గ్రహించాలి. అవి మనలో ధైర్యం ఆత్మ విశ్వాసం, మరియు ఉత్సాహం నింపే చైతన్యాన్ని, తేజస్సును ఇస్తాయి. వాటిని అధిగమించుట చేతనే మనం ఆ పరమాత్మ వద్దకు చేరుకోగలము. దానినే పి రికి సాధకులు అపరం ఆపారం అన్నారు. కావున మనోబలాన్ని ప్రయోగిస్తూ ఈశ్వరీయ సంఘటనా బలాన్ని తీసుకుంటూ విజయపతాకం చేతిలో తీసికొని సర్వశక్తి వంతుడైన పరమాత్ముని శక్తిశాలి సైన్యంలో విశ్వాసపాత్రుడైన సేనానిగా భావిస్తూ ఇంత వరకు ఎవరి పాదాలు పడని ఉన్నత స్థానాన్ని చేరుకొనే సాహసం చేయాలి. విఘ్నాలను నశింపచేయుటకు వాటితో తానే వినాశనం కావడమనేది కాగితపు పులిని నిజమైన పులిగా భావించి శక్తి హీనుడగుట వంటిది.
విఘ్నాలకు ఉద్వేగం చెందుట మన మానసిక స్థితి యొక్క లోపం. ఆవగింజను పర్వతంగా భావించి దానిని దాటుకొనే సాహసం చేయలేకపోవుట ఇది మన దృష్టి దోషమే. విఘ్నాలు పెద్దగా చిన్నగా కనిపించుట అనేది మన దృక్పదానికి దృష్టి కోణానికి సంబంధించినది. ఉదా:- ఒక పుటాకార కటకం నుండి చూచినపుడు తన్నుతాను చిన్నగా చూస్తాడు. కావున విఘ్నాలను విఘ్నాలుగా భావించకుండా వాటిని పురుషార్దమనే లూడో ఆటగా భావించాలి లేక నదిని దాటుకొనే వంతెనగా భావించి దానిపైకెక్కాలి.
మన ప్రస్తుత పరిస్థితిలో అసంతృప్తి పడుట కూడా ఒక విధంగా చూస్తే దీనికంటే ఉన్నతంగా అయ్యే సంస్కారం మనలో ఉందని మనం ఎపుడో ఇంతకంటే ఉన్నతమైన గమ్యమును చేరుకొన్నమనే దానిని ఋజువు చేస్తుంది. కావున ఈ అంతుష్టత కూడా మనకోసం సంతోషదాయకమే కావాలి. ఎందుకంటే మనం ఈ నాటి స్థితికంటే ఉన్నతంగా వెళ్ళగలము” అనేది సూచిస్తుంది.
మన మార్గంలో ఏదైనా అడ్డుగోడలు తగిలితే దానిని మనం గ్రహించవచ్చు మన వేగం కుంటుపడిందన తెలుసుకొని ఆ గోడలను తొలగించుకొనే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడమే తప్ప మరొక మార్గమే లేదు. నెపోలియన్ మార్గంలో ఒక పెద్ద పర్వతం అడ్డువచ్చి ఆటంకం కలిగించుట వలన అతని వేగం ఆగిపోయింది. కానీ ఈ నాడు నెపోలియన్ ను పర్వతాల పైన తుపాకులు ఎక్కించి విజయ దుందుభి మ్రోగించాడని కీర్తిస్తారు. అతని సేనాపతికి పర్వతమనిపించినది నెపోలియన్‌కు కేవలం ఒక ఎత్తుపల్లాల భూమివలె అనిపించింది. సేనాధిపతి దీని తరువాత ముందుకు వెళ్ళడం అసంభవమన్నపుడు నెపోలియన్ ”అసంభవమనే శబ్ధము మూర్ఖుల శబ్దకోశములో ఉంటుంది.” అని అన్నాడు. బుద్ధిబలం ఉపయోగించుటకు ముందు ”అసంభవమనిపించిందే – బుద్ధిబలంతో, ఉపాయంతో, నీతి నైపుణ్యంతో, సాహసంతో చేసినది ఒకనాటికి సంభవమేఅవుతుంది. మానవుడు చంద్రమండలంలో అడుగు పెట్టుట దూర దేశాలలో ఉన్న వ్యక్తిని యంత్రాల ద్వారా చూచుట మాటలు వినుట ఒకనాడు అసంభవమే అనిపించింది. కానీ ఈనాడు వైజ్ఞానికులు ఓర్పు, సాహసం నిరంతరం బుద్ధితో యుద్ధం చేసిన దానికి ఫలితంగా సిద్దిని పొందారు. అనేక క్లిష్టమైన ప్రశ్నలను మూమూలు ప్రజల భావాలను,. ఆర్ధిక ఇబ్బందులను, ప్రాకృతిక విఘ్నాలను దాటుకొనవచ్చు అనే దానికి నిదర్శనంగా తయారయ్యారు. కావున మనం కూడా ప్రయత్నం, అభ్యాసమును ఏనాటికి విడిచిపెట్టరాదు. ఉదాహరణకు ఈనాడు ఒక గోడని మనం పది సుత్తి దెబ్బలు వేసినా పడిపోకపోతే మనం ప్రయత్నాన్ని విడిచిపెట్టరాదు. చివరికి నూరవ సుత్తి దెబ్బకైనా సరే ఆ గోడ పగిలి మనకు మార్గాన్ని ఇస్తుంది. కావున
”పరిశ్రమేణహీ సిద్దయంతి కార్యాణి నమనోరధై:
నతుసుప్తస్య సింహస్య ప్రవిశంతే ముఖే మృగా: ”
అన్నారు పెద్దలు. కృషి చేయుట వలననే అన్ని కార్యాలు మనోరధాలు నెరవేరుతాయి. ఏదో ఒక రోజున మన మానసిక ఆలోచనలు మన కంట్రోల్‌లో రానప్పటికీ, ఈశ్వరీయ స్మృతిలో మన మనస్సు స్థిరంగా లేనప్పటికీ, జ్ఞాన శ్రవణంలో మనకు ఆనందం లభించనప్పటికీ, మన చెడు సంస్కారాలు ఏవైన మన ల్ని వదిలి పెట్టినప్పటికి కూడా, నిరాశపడవల్సిన అవసరం లేదనే విషయం ధ్యాసలో పెట్టుకొనాలి. అభ్యాసం అనే సుత్తి దెబ్బ ఏదో ఒక నాటికి సంస్కారం అనే గోడలను ధూళి ధూసరితం చేయగల్గుతుంది. ఇది తప్పదు. రాయి కూడా మట్టి ముద్దయే నిరంతరం రుద్దుట చేత అరిగిపోతుంది అటువంటప్పుడు మన పురుషార్ధం అనే ఉక్కు దెబ్బలముందు సంస్కారాలు తెగిపోకుండా ఉంటాయా?
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి