వరంగల్ కల్చరల్, ప్రభన్యూస్ : తెలంగాణ కాకతీయుల రాజధాని ఓరుగల్లుగా చరిత్ర ప్రసిద్దిగాంచిన వరంగల్ మహానగరంలోని శ్రీ భద్ర కాళి దేవ స్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారం భమై నాయి. ఉత్సవాల ప్రార్దన అనంతరం గణపతి పూజ, పుణ్యా వాహచనం, ఉత్సవ పూర్వంగా విధి ని ర్వహించిన తర్వాత పూర్ణ అభిషేకం నిర్వహించారు. దేవీ శరన్న వరాత్రి ఉత్సవాలను ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ రేవతిభాస్కర్ దంపతులు ప్రారంభించారు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం వృషభ వాహనసేవ, సాయంత్రం మృగ వాహన సేవలో అమ్మవారిని ఉరేగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement