పుట్టపర్తి ప్రభన్యూస్:భగవాన్ సత్యసాయి బాబా 96వ జయంతి వేడుకల్లో భాగంగా గురువారం వేణుగోపాలస్వామి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రథం కదిలిన కొద్దిసేపటికి వరుణుడు కరుణించగా, రథోత్సవ కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు వరుణుడు విరామం కల్పించారు. ఉదయం 9 గంటలకు పెద్ద వెంకమరాజు కళ్యాణ మండపం నుండి రథం ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం ద్వారం దగ్గరకు చేరుకోగా, అప్పటికే ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రత్యేకంగా అలంకరించిన వేణుగోపాల స్వా మి ఉత్సవ విగ్రహం తోపాటు- రామ, లక్ష్మణ, సీతా, ఆంజనేయ, స్వామి వార్ల విగ్ర హాలను సాయి కుల్వంత్ సభా మందిరం నుండి వేదపండితుల వేదమం త్రోచ్ఛారణలు, మేళతాళాలతో ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉరేగిస్తూ రథోత్సవం కొనసాగింది. చెక్కభజన, కోలాటం,దేవతామూర్తుల వేషధారణలు, భజన పాటలు, వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం జరిగినంత సేపు వర్షం రాకపోవడం విశేషం అనంతరం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement