Tuesday, October 1, 2024

ప్రభావాలు (ఆడియోతో…)

మనం అణకువగా ఉందాము, సమైక్యంగా ఉందాము, అందరితో కలసిపోదాము కానీ వారి ప్రభావం మనపై పడకూడదు. ఇతరులు వారిలోని అహంకారానికి, వారిలోని చెడుకు, వారి మనసులోని సాధారణతలలోని వారే ప్రభావితం కావచ్చు. అంతమాత్రాన మనం కూడా ప్రభావితం కావాలని ఏమీ లేదు. మనలో ఎంత సత్యత ఉండాలంటే ఎదుటివారు కూడా సత్యంగా అయిపోవాలి. మన ఆంతరిక స్థితి ఎలా ఉండాలంటే ఇతరులలోని చెడుకు మనం ప్రభావితం కాకపోవడమే కాదు, మన హాజరు సైతం ఒక మంచి ప్రభావాన్ని కలిగించాలి. ఇది నిజమైన ఆధ్యాత్మిక ఉపరామము.

స్వయాన్ని ఒక ఆధ్యాత్మిక ఉనికిగా అనుభవం చెయ్యడం ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భగవంతుడి దగ్గరకు వచ్చిన తర్వాత మన ముఖంలో వచ్చిన తేజస్సును ఎప్పుడూ దాచిపెట్టుకోకూడదు. ఇప్పటివరకూ అహంకారంతో చేస్తున్నవన్నీ ఇప్పటి నుండి ప్రేమతో చెయ్యాలి.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement