Tuesday, November 26, 2024

పొరపాట్లు (ఆడియోతో…)

నీ అవగాహన మరి కొంత విస్తరించుకో అప్పుడు పొరపాట్లు కారణంగా సిగ్గు పడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు, నీ జీవితాన్ని నువ్వు నాటకంలోని ఒక పాత్రధారునిగా చూసుకున్నట్లయితే ఆ దృశ్యాల వెనుక ఉన్న రహస్యాలు ఒక దాని తర్వాత ఒకటి తెలుస్తూ ఉంటాయి. గడిచే ప్రతి దృశ్యము, గడిచిన తర్వాత, ఇప్పుడది సమాప్తమైపోయింది – పరిస్థితులను చూసే విధానము ఇది అని జ్ఞానము చెబుతుంది. గడిచినదేదో గడిచిపోయింది అని అనుకుంటే అంతా తేలికగా ఉంటుంది. నువ్వు గతాన్ని మార్చలేవు, కానీ నువ్వు భవిష్యత్తును తప్పకుండా మార్చగలవు. తద్వారా పొరపాటు మరల పునరావృతం కాదు. భగవంతునితో సంబంధం నీకు ఎంతో శక్తిని ఇస్తుంది, అది నీ తప్పులను తుడిచి వేస్తుంది.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement