Tuesday, November 26, 2024

పునర్జన్మ… పరమ సత్యం!

హిందూ ధర్మ పథంలో పునర్జన్మ సిద్ధాంతం అత్యంత విశ్వస నీయమైనది. సనాతన వాఙ్మయంలో దీనికి అనేక తా ర్కాణాలు కనబడతాయి. ఈ పునర్జన్మ విశ్వాసం మానవు ని అనేక అలౌకిక సందేహాలకు పరిష్కారం చూపిస్తుంది. మరణ మంటే పాంచభౌతిక శరీరం తిరిగి వాటిలో మిళితం కావడం. సూక్ష్మ శరీరంతో వివిధ లోకాలకు ప్రయాణించడం. ఏడు ఊర్ధ్వ లోకాలు, ఏడు అధో లోకాలలో తిరిగి తిరిగి మరలా ప్రారబ్ధము వలన, సంచిత, ఆగామ కర్మల వలన పునర్జన్మ పొందుతాడు. జీవు డు పవిత్రుడైతే ఊర్ధ్వలోకాలకు, అపవిత్రుడైతే అధోలోకాలకు గమ నం చేస్తాడు. తిరిగి వాసనా ప్రభావం చేత పునర్జన్మ పొందుతాడు.
నిరంతరం మన శరీరంలోని అణువులు అనుక్షణం మరణి స్తూ తిరిగి నూతన అణువులు జనిస్తున్నాయి. ఏడు సంవత్సరాల లోపు దేహంలోని అన్ని జీవకణాలు మారిపోతాయి. కాని మన లోని నేను అనే అహం మాత్రం ఏ మార్పు లేకుండా నేను, నేను అనే భావనలో ఉండటం ఒక గొప్ప ఆశ్చర్యం. బాలునిగా నేను అనే భావ న వృద్ధునిగా కూడా నేనుగా ఉంటుంది. ఆ భావనయే జీవాత్మ.
పునర్జన్మను ప్రపంచములోని ఎక్కువ మతాలు పూర్తిగా విశ్వ సిస్తున్నాయి. తూర్పు దేశ తత్త్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. గౌతమ బుద్ధుడు తన గత జన్మల గురించి ప్రస్తా వించాడు. పైథాగరస్‌, ప్లేటో, సోక్రటీస్‌ మొదలైన తత్త్వవేత్తలు పున ర్జన్మను సమర్థించారు. ఇంకా అనేక పునర్జన్మల ఉదంతాలు ప్రపం చ చరిత్రలో మనకు సవాలు విసురుతూనే ఉన్నాయి. సాధారణం గా యుగ ప్రభావం వలన సందేహం ముందు పుట్టి తరువాత మను జుడు పుడుతున్నాడు. కాని పునర్జన్మ అన్నది పరమ సత్యం.
స్థూల, సూక్ష్మ శరీర విశ్లేషణను సశాస్త్రీయంగా విశ్లేషణ చేసిన శ్రీ శంకర భగవత్పాదులు సనాతన ధర్మపథంలో అగ్రగణ్యులు. చర్మము, మాంసము, రక్తము, నాడులు, మేథ, మజ్జ, ఎముకలు అను ధాతువులతో నిండి మల మూత్ర భరితమైన శరీరమే స్థూల శరీరము. పంచభూతముల వలన ఏర్పడిన ఈ శరీరము ఆత్మకు స్థూలమైన భోగ స్థానము. ఇది ఎల్లప్పుడూ జాగ్రద్దశలో పదార్థాను భవమును ప్రాప్తింప చేసుకొనును. జాగ్రదవస్థయందు స్థూల శరీ రము బాహ్యేంద్రియముల ద్వారా భోగములను సేవించు చుండు ను. గృహము గృహస్థునకు ఎటువంటిదో జీవునకు స్థూల శరీరము అటువంటిది. బాహ్య జగత్తును భ్రమించునది ఈ స్థూల శరీరము. దీనికి జననము, వార్ధక్యము, మరణము ధర్మములు. లౌకిక ధర్మ ములైన వర్ణాశ్రమ నియమములు, యమములు, పూజ, మాన ము, అవమానము బహుమానము మొదలైనవి ఆపాదించబడి యుండును. కర్మేంద్రియాల పంచకము, శ్రవణము మొదలగు జ్ఞానేంద్రియాల పంచకము, ప్రాణాపానాది పంచవాయువులు, పంచభూతములు, అంత:కరణ చతుష్టయము, అవిద్య, కామ ము, కర్మ ఈ ఎనిమిది కలిపి పూర్యష్టకమందురు. దీనినే సూక్ష్మ శరీరమనబడును. దీనినే లింగ శరీరమందురు. ఇది పంచీకృతము కాని భూతముల చేత ఏర్పడినట్టిది. ఇది వాసనాభరితమైనది. కర్మ ఫలమును అనుభవింపజేయును. ఇది స్వస్వరూప రహితమైన ఆత్మకు అనాదియైన ఉపాధి.
వాసనా క్షయము కాని సూక్ష్మ శరీరము నెరవేరని ఆశల బలం చేత జీవాత్మ ద్వారా తిరిగి పునర్జన్మ పొందుతాడని సనాతన మతం విశ్వసిస్తోంది. జీవుడు ఒక రూపం నుండి మరొక రూపానికి మారు తూ ప్రయాణించే జీవన భ్రమణమే సంసారము. జీవాత్మ జన్మల మీదుగా సాగుతూ పరిణతి చెందుతుంది. జ్ఞానయోగంతో మాన వ జన్మలు ఎత్తి చివరకు ముక్తిని సాధిస్తాడు. జ్ఞానయోగ సాధన లోపించిన మానవ జన్మ నుండి తిరిగి అధోజన్మలైన జంతుకీట కాది జన్మలు ధరించే అవకాశముంది. ప్రారబ్ధ కర్మ క్షయమవగానే శరీరం పడిపోతుంది.
సనాతన ధర్మము జన్మరాహిత్యమే ముక్తి అని తెలియజేసింది. దానికి అవసరమయిన సాధనను కూడా మనకందించింది. పున ర్జన్మ రహస్యాన్ని తెలియచేస్తూనే పునర్జన్మ లేకుండా చేసుకొనే యో గ రహస్యాన్ని కూడా తెలియచేసింది.
దేహినో2స్మిన్‌ యథాదేహే కౌమారం ¸°వనం జరా!
తథా దేహాన్తర ప్రాప్తిర్థీ రస్తత్ర నముహ్యతి!!
దేహము బాల్యము నుండి ¸°వనమునకు, ¸°వనము నుండి వృద్ధాప్యమునకు ఎటుల మార్పుచెందునో అటులనే మర ణాంతరము వేరొక దేహమును పొందును. అనగా చైతన్యవంత మైన జీవాత్మ మరొక జన్మను పొందును.
బహూనియే వ్యతీతాని జన్మాని తవచార్జున!
తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరన్తప!!
ఓ పరంతపా! నీకును, నాకును పలు జన్మలు గడిచినవి. నాకు అవి అన్నియూ జ్ఞప్తియందున్నవి. కాని నీవు వాటిని జ్ఞప్తియందుం చు కొనజాలవు. ఇటుల భగవానుడు పునర్జన్మలను విశదపరచి నాడు. ఫలాపేక్ష రహితముగా కర్మలనాచరించి సదా నన్ను సేవించ మని శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించాడు.
తేషామహం సమద్ధర్తా మృత్యు సంసార సాగరాత్‌!
భవామి న చిరాత్పార్థ మయ్యా వేశిత చేతసామ్‌!!
”ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి నాయందే మనసు లగ్నము చేసిన నా భక్తులకు అచిరకాలముననే జనన మరణము లతో గూడిన సంసార సముద్రము నుండి తరింపజేతును” అని భగవానుడు అభయమిచ్చాడు. ఇది ఎనుబదినాలుగు లక్షల జీవరాశులకు వర్తించును.
పునర్జన్మను అంగీకరించిన తదుపరి వచ్చే సందేహము, సృష్టి ప్రారంభము నుండి అనేకమంది ముక్తిని పొందితే మానవ సంఖ్య తగ్గవలెను కదా! దీనికి సమాధానం, అధోలోకాలను పొందిన జం తు జాలములు కర్మ పరిణామంలో మానవజన్మ పొందడం. ఎం దువలననగా ఆత్మ ఒకటే కనుక జీవి ఒక జాతి నుండి మరొక జాతికి పరిణామం పొందుతూ ఉంటుంది అని పతంజలి మహర్షి విశదీక రించాడు. కావున స్వధర్మమును ఆచరిస్తూ జన్మరాహిత్యం పొందుట లక్ష్యం కావాలి.
– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement