మనందరం తెలిసి కొన్ని, తెలియక కొన్ని, పాపాలు చేస్తూం టాము. ”చేసిన పాపాలకు పరితపించి, ఇకమీదట, ఇట్లాంటి పాపాలను చేయను, అని నిర్ణయించుకొని ధర్మంగా, సత్ప్రవర్తనతో జీవిస్తే అంతకుముందు చేసిన పాపాలు క్రమక్రమంగా తుడుచు పెట్టుకొనిపోతాయి. ఈ విషయం వేదం తెలియచేస్తోంది. ఇది వాస్త వం.” అని ఇంద్రుడు ప్రశ్నకు బదులిస్తూ బృహస్పతి చెప్పారు. దీనికో ఉదాహరణ అంటూ, బృహస్పతి ఇలా చెప్పాడు.
విదిశ అనే పట్టణంలో శివశర్మ అనే విప్రుడు పశ్చాత్తాపం చెం ది, ధర్మంగా జీవిస్తుండగా, ఆయన కుమారుడు మృతి చెందాడు. అంతిమ సంస్కారాల కోసం బంధువులు శ్మశానానికి తీసు కొ చ్చి, పట్టలేనంత దు:ఖంతో బాధపడుతున్నారు. అప్పుడు ఒక గ్రద్ద వచ్చి ”మీరు ఈ వల్లకాటిలో ఏడుస్తూ ఉండడం మంచిది కాదు. చీకటి పడుతున్నది. భూతాలు, పిశాచాలు సంచరించే సమ యం. ఎంత విచారించినా ఆ బాలుడు తిరిగి రాడు. మీరు కార్య క్రమం పూర్తి చేసుకొని వెళ్ళిపొండి” అని హెచ్చరించింది.
దూరంగా ఉన్న కలుగులో నక్కి ఇదంతా వింటున్న నక్క వచ్చి, ”గద్ద మాటలకు అంత భయపడడం ఎందుకు అయ్యో! మీ కడుపు శోకం తీరేదాకా ఏడవండి.ఇంతలో ఆ పరమేశ్వరుడు దయ తలిస్తే, ఈ పిల్లవాడిని బ్రతికించగలడు కదా! ఇంకా సూర్యాస్తమ యం కాలేదు మీరేం భయపడకండి.” అని పలికేసరికి, అక్కడ ఉన్నవారిలో ఆశ పుట్టింది. అప్పుడు గ్రద్ద వీళ్ళను ఉద్దేశించి, ”ఈ జిత్తులమారి నక్క మాటలు వినకండి. ఇది మందమతిది. పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా? యముడు చాలా నిర్థయుడు. ఎవరినీ లెక్క చేయడు. ప్రాణాలు తీసేస్తాడు. ఇక చేయవలసిన దాన ధర్మాలు చేసి ఆ పిల్లవాడికి ఉత్తమగతులు కల్పించండి.” అంది.
వెంటనే నక్క ”గ్రద్దది రాతిగుండె. మీ దు:ఖం తీరకుండానే వెళ్ళిపోవడం ఎలా తట్టుకొంటారు. నావంటి వాళ్ళకే కళ్ళు చెమ్మ గిల్లుతున్నాయి. నిర్దయగా వెళ్ళకండి. దైవం అనుకూలించి ప్రా ణం నిలబెడితే, సంతోషంగా ఇంటికి వెడతారు!” అంది.
నక్క మాటలకు కోపంతో గ్రద్ద ”నేను పుట్టి పది హేనువందల సంవత్సరాలు అయ్యింది. ఇంతటి సుదీర్ఘ కాలంలో. మరణించిన జీవి ఎవరూ బతకలేదు. చనిపోయిన వారు మరోజన్మ ఎత్తుతారం టారు కదా! చనిపోయిన వాడు పునర్జీవుడవుతాడా? అనగానే నక్క ”రాముడు ప్రాణంపోయిన బాపడు పుత్రుడ్ని బ్రతికించలేదా! నారదమహర్షి తన మ#హమ చూపి సంజయుడనే రాజకుమారు డుకి ప్రాణం పోయలేదా? అలాగే ఈ బాలుడు తల్లితండ్రు లు చేసిన పుణ్యకార్యాలవల్ల ఏ సిద్దుడో, ఏ పుణ్యపురుషుడో, మీ పిల్లవానికి ఊపిరి పోయవచ్చు కదా!” అనగానే సూర్యాస్తమయం అయ్యింది. గ్రద్ద, నక్క, ఆకలితో మరణించిన బాలుడిని పీక్కు తినాలనే ఉద్దే శ్యంతో వారి మాటకారితనాన్ని ప్రదర్శిం చారు. చీకటి పడితే గ్రద్ద చూడలేదు. రాత్రి అయితే నక్కకు మేలు. అప్పుడే శ్మశాన వాటికలో విహరించాలని వచ్చిన శివుడు వీళ్ళను చూసి, ”మీరెందుకు విచా రిస్తున్నారు? ఏం కావాలి? కోరుకోండి” అని అడిగాడు.
వారు ఎంతో భక్తితో పరమేశ్వరుడును చూసి, అంజలి ఘటిం చి, ”ఓ! దయామయా! పరమేశ్వరా నీవు ఆదిపరాశక్తి పార్వతీదేవి భర్తవు. దేవతలలో ఉన్నతుడవు. ఈ పిల్లవాని మరణ దు:ఖంతో ఉన్నాం. మమ్మల్ని దయతలచి, మా మొర ఆలకించండి” అంటుం డగానే, పరమశివుడు ఆ పసివానికి ప్రాణంపోసి, ”ఈ పిల్లవాడు నిండా నూరేళ్ళు జీవిస్తాడు. ఇతని తండ్రిలో వచ్చిన పశ్చాత్తాపం వల్ల, ఆ దంపతులు సంపాదించిన పుణ్యం వల్ల ఇది సాధ్యమైంది.” అని ఆ బాలుడిని ఆశీర్వదించాడు. నక్క, గ్రద్దలకు ఎప్పటికి ఆకలి లేకుండా చేసి, అంతర్థానమయ్యాడు. మానవులలోని ఔన్నిత్యా న్ని, సత్య శీలతను, ధర్మాచరణను చూసి వాళ్ళ కన్నీళ్ళు తుడవడం దేవతల పని. కడుపే కైలాసం అనుకొని, తమ పనులను చక్కపెట్టు కొనే నక్క, గ్రద్ద వంటివాళ్ళ మాయమాటలను వినకపోవడం తెలి వితోకూడిన పని.” అంటూ బృ#హస్పతి కథను ముగించాడు.
”ఈ కథ చదివినవారికి, విన్నవారికి, ఆయుష్ ప్రమాణం పెరగడమేకాక సత్ప్రవర్తన అలవడుతుంది” అన్నాడు బృహస్పతి. కాబట్టి ఇకనుండైనా ధర్మంగా జీవిస్తూ, ఆ భగవంతుని కృప పొందుదాం!
(మహాభారతంలోని ఒక ఉపాఖ్యానం)
– అనంతాత్మకుల రంగారావు
7989462679