మన భరతభూమి ఎంతో పుణ్యభూమి. ఎందరో మహర్షులు, దానశీలురు, తత్త్వజ్ఞానులు వంటి మహానుభావులు జన్మిం చిన నేల. అందుకే, వారి త్యాగాల ఫలితంగా, వారి జీవితాలను ఆద ర్శంగా తీసుకొంటూ ముందుకు సాగడం వల్లనే, ఈ కలియుగంలో ధర్మం, సత్ప్రవర్తన వంటి సద్గుణాలు కొంతమందిలోనైనా గోచరి స్తున్నాయి. మహాభారత ఉపాఖ్యానములలో ధర్మ స్వరూపం తెలియచేయడానికి, ధర్మ సూక్ష్మములు తెలియచేయడానికి, ఎన్నో సంఘటనలు ఇవ్వబడ్డాయి. ”అహింసా పరమోధర్మ:” అనేది జీవ నాడి. పరోపకారార్థం తమ శరీరాలను అర్పించి ”పరోపకారమిదం శరీరం”అన్న శిబి చక్రవర్తి, జీమూతవాహనుడు, బోధిసత్వులు వంటి వారు మహనీయులు.
పాండవులు అరణ్యవాసం చేస్తూన్న కాలంలో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలను సందర్శిస్తున్న సందర్భంలో వారు ”విష్ణుపథం” అనే తీర్థం వద్దకు వచ్చారు. విష్ణుపథం అనే ఈ పుణ్యనది మానస సరోవరం ముఖద్వారం. దానినే ”మానస ద్వారం” అంటారు. దీనిలో స్నానమాచరించినా, నదీతీరంలో యజ్ఞయాగాదులు చేసి నా విశేషమైన ఫలాన్ని పొందడమే కాక మోక్షం సిద్ధింస్తుందని రోమశ మహర్షి వివరిస్తూ, దీనిని పరశురాముడు నిర్మించాడని, ఈ మానస ముఖద్వారం వద్ద చైత్రమాసంలో మహర్షులు అందరూ చేరి, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేవారు. ఒకసారి అలా జరుగుతున్న సందర్భంలో వారికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్య క్షమై వారి మనోభీష్టిని సిద్ధింపచేసారు. ఇక్కడే వశిష్ఠ మహర్షి తన భార్య అరుంధతీదేవితో కలసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసాడు. కనపడుతున్నది భృగుతుంగ పర్వత శిఖరం. అక్కడే ఉశీనరపతి శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేసాడు. శిబి ఏడుద్వీపాలలో తన రథా న్ని యదేచ్ఛగా నడిపినవాడు. శత్రువులు అన్నమాటే ఎరగనివాడు. ప్రజలను బాధించడు. గొప్ప ఉన్నతుడు. శివుడు మెప్పు పొందాడు.
గొప్ప దానశీలిగా పేరుగాంచిన శిబి చక్రవర్తిని పరీక్షించాలని, ఆ యజ్ఞ సమయంలో ఇంద్రుడు, అగ్ని వేరు రూపాలతో వచ్చారు. ఇంద్రుడు డేగ రూపంతోను, అగ్ని పావురం రూపంతోను మారా రు. పావురం భయంతో శిబి చక్రవర్తి ముందుకు వచ్చి ”మహాప్రభో! నన్ను చంపడానికి డేగ వెంటాడుతోంది. రక్షించండి” అని శరణు కోరింది. దాని వెనుకనే డేగ వచ్చి శిబితో ”అయ్యా! చక్రవర్తి మహా శయా! నీవు సత్యాన్ని, ధర్మాన్ని, ఆచరించడం చేత, నిష్కళంకమైన వానిగా విన్నాను. ఇప్పుడు నేను ఆకలితో అలమటిస్తూ పావు రాన్ని పట్టుకోబోతే, పారిపోయి, నిన్ను శరణు వేడింది. ఆకలితో ఉన్న నాకు విఘ్నంచేయడం మీకు సమ్మతంగా ఉందా? ఈ జగత్తులో సర్వ ప్రాణులకు ఆహారమే కదా శక్తి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే, నాప్రాణాలు నిలవవు. అప్పుడు నా సంతా నం, నా భార్య, దిక్కులేని వారవుతారు. వారు ఏ ఆత్మ త్యాగాని కైనా పాల్పడవచ్చు కదా. ఒక్క పావురాన్ని కాపాడి, ఇన్ని ప్రాణా లను హింసించడం ధర్మానికి వ్యతిరేకం. ధర్మ స్వరూపాన్ని ఎరి గిన జ్ఞానులు ధర్మానికి కీడు కలిగించడం మీకు సమ్మతమేనా? డేగలు పావురాలను భక్షిస్తాయని అనే వేద వాక్యం మీకు తెలి యంది కాదు. కాబట్టి, ఈ పావురాన్ని ,ఆహారంగా నాకు అప్పగిం చండి” అని డేగ కోరింది.
దానికి శిబి చక్రవర్తి ”ఈ పావురం ప్రాణ భయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది. ఆశ్రయించినవారిని ఏ నీచుడూ వదలడు కదా. నన్ను ఆశ్రయించిన పావురాన్ని ఎట్లా అప్పగించను? ధర్మ వ్యతిరేకం కదా. నీ ఆకలి ఈ పావురాన్ని తింటేనే కాని తీరదా? ఈ అడవిలో ఎన్నో రకాల పక్షులు, లేళ్ళు, పందులు. ఇంకా అనేక జంతు వులు ఉన్నాయి. ఏదో దాన్ని నీవు పొందవచ్చు కదా!” అనగానే డేగ ”ఓ! మహారాజా! ఈ పావురం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆహారం. ఈ పక్షిని రక్షించాలని మీరు భావిస్తే, దీని బరువుతో సమాన తూకం తో మీ శరీర మాంసం నాకు ఇవ్వండి.” అని కోరింది.
ఆ డేగ పలుకులకు శిబి ఎంతో సంతోషపడి, ”పక్షులలోకెల్లా నువ్వు ఉత్తమమైన దానివి.” అంటూ కత్తితో తన శరీరంలో నుండి పావురం ఎత్తు మాంసం కోసినా, ఆ పావురం ఉన్న భాగమే క్రిందకు తూగుతోంది. అప్పుడు శిబి ఆశ్చర్యపడి తరాజులో తనే కూర్చొ న్నాడు. అప్పుడు శిబి ఆత్మార్పణ పూర్వకమైన త్యాగానికి, గొప్ప గుణానికి సంతోషించి. ఇంద్రుడు, అగ్ని పురుషుడు అభినందించి వారి నిజ రూపాలతో ప్రత్యక్షమై ”ఓ రాజా! మహానుభావా! నీ త్యాగం, ధైర్యం, శౌర్యం, ఎవ్వరిలోనూ కనపడవు. ఇంతవరకూ నీ కీర్తిని విన్నాము. ఇప్పుడు మా కన్నులారా వీక్షించాము. నీ కీర్తి మాన వులు బ్రహ్మ శబ్దాన్ని ఉపాశిస్తూన్నంత కాలం విరాజిల్లుతూం టుంది.” అని వరాలు, అభయము ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఆ మహానుభావుని క్షేత్రం. ఎప్పుడూ పండ్లతోను, పచ్చని చెట్లతోను శోభిల్లుతూ ఉంటుంది.” అని రోమశ మహర్షి వివరించాడు. నేటి కాలంలో ధనార్జనకే అభిలషిస్తున్నారు, తప్ప, కొంచెమైనా దానం చేద్దామనే ఉద్దేశ్యం కనపడుటలేదు. నైతిక విలువలు కనుమరు గవుతున్న నేడు పిల్లలో మంచి స్వభావాన్ని ఏర్పరచడానాకి, ఇటువంటి కథలు ఎంతో ప్రేరణను కలిగిస్తాయి.
– అనంతాత్మకుల రంగారావు
7989462679
పరోపకారార్థమిదం శరీరం
Advertisement
తాజా వార్తలు
Advertisement