మేషం: వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.
వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభ వార్తలు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు. బంధువులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. దైవ దర్శనాలు.
మిథునం: మిత్రులతో వివాదాలు. కుటు-ంబ బాధ్యతలు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు.
కర్కాటకం: పనుల్లో విజయం. శుభ కార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. దూర ప్రాంతాల నుంచి శుభ వార్తలు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.
కన్య: పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలోవివాదాలు. ఆలయ దర్శనాలు.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. ధన వ్యయం. ఆర్థిక లావాదేవీలలో నిరుత్సాహం. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వస్తు లాభాలు.
ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.
మకరం: ఆర్థిక లావాదేవీలలో ఒడుదుడుకులు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. ఆరోగ్య భంగం. శ్రమ మరింత తప్పదు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకుసాగవు..
కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం
మీనం: నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యవహారాలలో పురోగతి. శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి