మేషం.. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు.
వృషభం.. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. చర్చలలో ప్రతిష్ఠంభన.
మిథునం.. శుభ వార్తాశ్రవణం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సోదరులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. ధనలబ్ధి.
కర్కాటకం… ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనుకోని ధన వ్యయం. ఆరోగ్య సమస్యలు.
సింహం.. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. యత్న కార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటు-ంది. వాహనయోగం.
కన్య.. సోదరులతో విభేదాలు .అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మానసిక అశాంతి. పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు నిరాశ.
తుల.. కొత్తవ్యక్తుల పరిచయం. శుభ వర్తమానాలు. అదనపు రాబడిఉంటు-ంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం.. ఆకస్మిక ధనలబ్ధి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
ధనుస్సు.. కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవరోధాలు. అనుకోని ఖర్చులు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగ మార్పులు.
మకరం.. వ్యవహారాలలో ఆటంకాలు. దూర ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. నిర్ణయాలు వాయిదా.
కుంభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో చర్చలు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వస్తు లాభాలు.
మీనం.. కొత్త పనులు చేపడతారు. దైవ దర్శనాలు. బంంధువుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి