మేషం: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు -పోట్లు- తొలగుతాయి.
వృషభం: మిత్రుల నుంచి విమర్శలు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
మిథునం: కార్యజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. సోదరుల కలయిక. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.
సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు చేస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణంగా ఉంటాయి.
కన్య: రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలలో అవాంతరాలు. దూర ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోవివాదాలు.
తుల: నూత నవ్యక్తుల పరిచయం. శుభ వార్తలు అందుతాయి. కార్యజయం. భూ వివాదాలు. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతాయి.
వృశ్చికం: పెద్దల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. పనుల్లో గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
మకరం: కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులు తప్పకపోవచ్చు.
కుంభం: పనులలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదేపైచేయి.
మీనం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి