Tuesday, November 26, 2024

నేటి రాశి ప్రభ (4-5-21)

మేషం:
ఇంటాబయటా వ్యతిరేకత. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆథ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం:
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం:
వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

సింహం:
వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు.

కన్య:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.

తుల:
నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.

వృశ్చికం:
మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు:
రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం:
పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు.

మీనం:
వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement