24-8-21
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృషభం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రముఖుల ప్రశంసలు. వృత్తి,వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆహ్వానాలు అందుతాయి.
మిథునం: పనులు మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. బంధువులతో స్వల్ప విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
సింహం: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.
కన్య: మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు.
తుల: బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహం, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం.
వృశ్చికం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
మకరం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. దైవచింతన.
మీనం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.