Wednesday, October 2, 2024

నేటి రాశి ప్రభ (19-03-2021 )

మేషం :
కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృషభం :
విద్యార్థులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. పనుల్లో విజయం. ప్రయాణాలలో నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం :
పరిస్థితులు అనుకూలించవు. పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.

కర్కాటకం :
కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

సింహం :
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

కన్య :
ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల :
వ్యవహారాలలో పురోగతి. ఆస్తి, ధనలాభాలు. చిరకాల మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం :
పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు :
మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం :
పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కుంభం :
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం :
దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement