మేషం:
ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
వృషభం:
పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మిథునం:
సోదరులతో విభేదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం:
సమస్యల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం:
కార్యజయం. ఆస్తిలాభం. రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశ్చర్యకర మార్పులు.
కన్య:
రుణబాధలు తప్పవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల:
కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం:
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనుస్సు:
బంధువర్గంతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం:
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూలాభాలు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం:
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో కలహాలు. అనారోగ్యం.
వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం:
మిత్రుల నుంచి దనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. భూవివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలోమరింతఅనుకూలత.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి