Friday, October 4, 2024

నేటి రాశి ప్రభ (15-4-2021)

మేషం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. భూయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం:
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు. అనారోగ్య సూచనలు.

మిథునం:
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి.

కర్కాటకం:
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.

సింహం:
కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య:
కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల:
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కొన్ని పనుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

వృశ్చికం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

ధనుస్సు:
ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. మిత్రుల కలయిక. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మకరం:
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.

కుంభం:
బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు.

మీనం:
అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగిస్తారు. దైవదర్శనాలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement