మేషం:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.
వృషభం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
మిథునం:
శుభవార్తలు వింటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కర్కాటకం:
వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో వివాదాలు. పనుల్లో జాప్యం. అనుకోని సంఘటనలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన.
సింహం:
బంధువుల నుంచి ఒత్తిడులు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య :
ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. కళాకారులకు ఒత్తిడులు.
వృశ్చికం :
పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
ధనుస్సు:
కుటుంబంలో చికాకులు. పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగమార్పులు.
మకరం:
నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కుంభం :
శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.
మీనం:
రుణదాతల ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి