Tuesday, November 26, 2024

నేటి రాశి ప్రభ (10-4-2021)

మేషం :
కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు.

వృషభం :
పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. వృత్తి,
వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆరోగ్యభంగం.

మిథునం :
కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం :
కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు..

సింహం :
నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూ,
గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య :
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

తుల :
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.
ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం :
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
పనుల్లో పురోగతి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..

ధనుస్సు :
వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు వాయిదా. కుటుంబంలో ఒత్తిడులు.

మకరం :
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. సోదరుల నుంచి ఒత్తిడులు.

కుంభం :
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో సఖ్యత.
వాహనయోగం. భూలాభాలు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు.

మీనం :
చిన్ననాటి మిత్రుల కలయిక. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబసౌఖ్యం. విందువినోదాలు. దైవదర్శనాలు. ఆహ్వానాలు అందుతాయి.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement