ద్వైతవనంలో పాండవులు విడిది చేస్తున్నప్పుడు ఒక బ్రా#హ్మణుడు తొత్తరపాటుతో వచ్చి ”ఓ! ధర్మనందనా! నా ఆరణిని ఒక చెట్టుకొమ్మకు వ్రేలాడదీశాను. ఒక లేడి వేగంగా అటు పరుగెడుతున్నప్పుడు నా ఆరణి దాని కొమ్ములకు తగిలించుకొని పారిపోయింది. నా నిత్యానుష్టానానికి ఆరణి అవస రం కదా! నాకు నా ఆరణిని తెచ్చి సహాయం చేయమని” అర్థిం చాడు. (ఆరణి అంటే వేదపండితులు దాని నుండే అగ్నిని పుట్టించి నిత్య వైదిక కర్మలు చేస్తూంటారు.) పాండవులు తలోదిక్కుకు వెళ్ళి ఆ లేడి కనపడక, అలసిపోయిన వారందరకి, దా#హం వేసింది. దగ్గ రగా ఉన్న తటాకం నుండి మంచినీరు తెమ్మని స#హదేవుడుని ధర్మ రాజు ఆజ్ఞాపించాడు. స#హదేవుడు తటాకంలో దిగుతూ ఉంటే, ఒక శరీరం లేని యక్షుడు ”అన్నా! ఈ చెరువు నాది. నా ఈ చెరువు లో నీళ్ళు తాగాలంటే, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి” అని అన్నాడు. స#హదేవుడు ఆ మాటలను లెక్కచేయకుండా నీరు తీసుకోబోయి, గట్టు మీదే కుప్పకూలాడు. స#హదేవుడు ఎంతసేప టికీ రాలేదని, నకులుడు వచ్చినా అలాగే జరిగింది. కాసేపటికి వరు సగా భీమార్జునులు వచ్చినా అలాగే జరిగింది.
ఆఖరుగా ధర్మరాజు బయలుదేరి తటాకం వద్దకు వచ్చి తన తమ్ముళ్లు పడిపోవడం చూసి పరితపిస్తూ, దు:ఖంతో ”ఏమి ఈ వింత. మహావీరులైన నా సోదరులు ఇలా, అచేతనంగా పడిపోవ డం ఏమిటి?” ఇలా పరిపరివిధాలుగా ఆలోచిస్తూ కొలనులోకి దిగాడు. ఆ యక్షుడే కొంగ రూపంలో కనపడి, ”ఓ! ధర్మనందనా! ఈ తటాకం నాది. నేనొక యక్షుడను. నేను వేసే ప్రశ్నలకు సమా ధానం చెప్పి, నీరు త్రాగవచ్చు. నీ తమ్ముళ్లు నామాట ధిక్కరించి నందునే ప్రాణాలు పోగొట్టుకొన్నారు.” అన్నాడు.
తమ్ముళ్ల అచేతనానికి కారణం తెలుసుకున్న ధర్మరాజు ”మహాత్మా! నువ్వు ఎవరివో నన్ను, నా సోదరులను పరీక్షించడా నికి వచ్చిన యతివో? నాకున్న జ్ఞానపరిధిలో జవాబులు చెపుతా ను. అడగండి.!” అన్నాడు. వెంటనే యక్షుడు మొదటగా ”సూర్యు ని నడిపేది ఏది? సూర్యునికి ఆధార భూతం ఏది? సూర్యశక్తి ఎటు వంటిది?” అనగానే ధర్మరాజు ”సూర్యుడుని పరబ్ర#హ్మము నడు పుతోంది. సూర్యుడు వేల్పుల చేత పూజింపబడుతూ ధర్మం చేత అస్త మిస్తాడు. ఆ మహాత్ముడుకు ఆధారం ధర్మమే.” అన్నాడు.
మరొక ప్రశ్న ”జీవన్మృతుడు ఎవరు?” అని అడగ్గా ధర్మరాజు దానికి బదులిస్తూ ”దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, తన ను ఆశ్రయించి ఉన్నవారికి, పేదలకు పెట్టకుండా భోజనం చేసే వాడు జీవన్మృతుడు (బ్రతికి ఉండగానే మరణించినవాని)తో సమానం. అని చెప్పగానే, యక్షుడు మరోప్రశ్న సంధిస్తూ ”భూమి కంటే బరువైనది ఏది?” అడిగాడు. దానికి ధర్మరాజు ”తల్లి ఋణ మే!” అని జవాబు ఇవ్వగానే, ”ఆకాశం కంటే విశాలమైనది, ఉన్నత మైనది ఏది?” అడగగానే ధర్మరాజు బదులిస్తూ ”ఆకాశం కంటే విశాలమైనది తండ్రి #హృదయం. తండ్రే ఉన్నతుడు.”
”నరుడికి ఆత్మ ఎవరు? అతనితో దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు?” అని మరో ప్రశ్న అడగగానే ”నరుడికి ఆత్మపుత్రుడే. అత డికి దైవం ఇచ్చిన చుట్టం ”భార్యే! అతనికి స#హకరిస్తూ, కుటుంబ క్షేమమే ధ్యేయంగా వంశాభివృద్ధికి కారణభూతము భార్యే.”
”దేనివలన మానవుడు శ్రోతీయుడు అవుతాడు? దేనివల్ల మానవుడు గొప్ప మ#హమలను, బుద్దిని పొందగలుగుతాడు. అన గానే ధర్మరాజు ”వేదాధ్యయనంవల్ల, ఆచార వ్యవహారాలు పాటిం చడం వల్ల, శ్రోతీయుడు అవుతాడు. తపశ్శక్తి వల్ల, తల్లిదం డ్రులను, గురువులను, పెద్దలను సేవించడంవల్ల బుద్ధిమంతుడు అవుతా డు.” అని జవాబు చెప్పాడు
అలా ఎన్నో ప్రశ్నలు వేస్తే, ఓపికగా జవాబులు చెపుతున్నాడు ధర్మరాజు. అప్పుడు యక్షుడు ఆఖరి ప్రశ్న అంటూ ”మానవతా విలువలతో, సంతృప్తిగా ఉండేవాడెవరు?” అని అడిగాడు.
ధర్మరాజు ”రోజూ పచ్చడి మెతుకులు తింటూ దేనిగురించి చింతన లేని, ఋణం లేనివారే సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తా డు.” అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ యక్షుడు ”ఓ! ధర్మ రాజా! నీ ధర్మజ్ఞానానికి మెచ్చుకొన్నాను. నీ జవాబులు నాకు సంతృ ప్తినిచ్చాయి. నీ తమ్ముళ్లలలో ఒకరు మాత్రమే బ్రతుకుతారు. ఎవ రికి ప్రాణం పొయ్యమంటావు?” అని అడిగాడు.
ధర్మరాజు ”శ్యామల శరీరుడు, ఆజానుబా#హువు, నకులుడు ని బ్రతికించమని కోరగా, యక్షుడు ”ధర్మనందనా! లోకోత్తర వీరు లైన అర్జునుడు, భీముడు ఉండగా, నకులుడనే ఎందుకు కోరావు?” అని ప్రశ్నించాడు. ఇక్కడ కూడా ధర్మరాజు ధర్మాన్నే పాటించాడు. బదులిస్తూ ”మా తండ్రి పాండుమహారాజుకు కుంతీదేవి, మాద్రి, అనే ఇద్దరు భార్యలు. కుంతీసుతులలో నేనుండగా, మాద్రిసుతుల లో ఒకడైనా జీవించాలికదా! అందుకే నకలుడు పెద్దవాడు. కాబట్టే అలా కోరాను”అని వివరించగానే, కొంగరూపంలో ఉన్న యక్షుడు స#హజరూపంతో ప్రత్యక్షమవ్వగా ధర్మరాజు ”యముడికి నమస్క రించి బ్రా#హ్మణుడు పోగొట్టుకున్న ఆరణి విషయం వివరించాడు. యముడు పాండవులు అందర్నీ మేల్కొనేట్లు చేసాడు. ఆ లేడిరూ పం, బ్రా#హ్మణుడు రూపం నేను సృష్టించినవే! నీ మానసిక ప్రవృత్తి తెలుసుకొందామనే ఇలా చేసాను. మీ అరణ్యవాసం ముగియపో తోంది. మీరు అజ్ఞాతవాసం పూర్తి చేయాలి. మీరు ఏ రూపాన్ని కోరి తే, ఆ రూపం వచ్చే వరమిస్తున్నాను.” అని అంతర్థానమయ్యాడు.
ఈ కథలో తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను సేవించా లని, సన్మార్గంలో నడవడం ముఖ్యమని చెప్పే మంచి విషయాలు తెలుస్తున్నాయి. ఈ నాటి పరిస్థితులకు చాలా అవసరం. కనీసం కొంతవరకైనా ధర్మంగా జీవిస్తూ, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
– అనంతాత్మకుల రంగారావు
79894 62679