అమరావతి, ఆంధ్రప్రభ : శర న్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టు డైన మహిషాసురుడిని సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల, ఋషుల, మాన వుల కష్టాలను తొలగించింది. ఇంద్రకీ లాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదు ర్గమ్మవారి సహజ స్వరూపం ఇదే. మ హిషాసురమర్థినీదేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడంవలన అరిషడ్వర్గాలు నశిస్తాయి, సాత్వికభా వం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య, శౌర్య, విజయాలు చేకూరుతాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement