మహాభారతంలో మేధస్సు, ధైర్యం, సౌందర్యం కలగలిసిన ఎన్నో ఉత్తమోత్తమ స్త్రీ పాత్రలు మనకి తెలుసు. ఈ స్త్రీ పాత్రలు ఎంత ఉత్తమమైనవంటే వారిని చూసి నేటి స్త్రీలు కూడా శౌర్యపరాక్రమాలతో ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు. ఆనాటి పురుషాధిక్య సమా జంలో నిర్భయంగా తమ గళాన్ని వినిపించిన స్త్రీ పాత్రలని చూస్తే వీరు అసలు ఆ కాలంలో పుట్టవలసినవారు కాదనిపి స్తుంది. ఈ పాత్రలు మనకి నిర్భయంగా భావాన్ని వ్యక్తం చేయడాన్ని, ధైర్యం, విశ్వాసాన్ని, అంకితభావాన్ని నేర్పు తాయి. మహాభారతంలో అత్యంత అందమైన, అద్బుత మేధస్సు, సౌందర్యం కలగలసి పోతపోసి భగవంతుడు వీరి సృష్టించాడా అనిపిస్తుంది. వారే వీరు-
గంగాదేవి
శంతన మహారాజు మొదటి భార్య గంగ. ఆమె అందా న్ని చూసి మోహించిన శంతన మహారాజు తనని మనువాడా ల్సిందిగా గంగని కోరతాడు. అయితే ఆమె మూడు నిబంధన లతో శంతన మహారాజుని వివాహమాడుతుంది. అందులో మొదటి నిబంధన- తను ఎక్కడ నుండి వచ్చింది ఇత్యాది వివరాలేమీ మహారాజుని అడగకూడదు. రెండవది- తాను ఏమి చేసినా మహారాజు ఆమె చర్యలని – అవి మంచివే అయి నా లేదా చెడువే అయినా మన్నించాలి. ఇక మూడో నిబంధ న- పై రెండింటిలో ఏ ఒక్క దానిని మహారాజు అతిక్రమించి నా ఆమె మహారాజుని వదిలి వెళ్ళిపోతుంది.
సత్యవతి
సత్యవతి శంతనమహారాజు రెండవ భార్య. ఈమె మత్స్యకారుల కుటుంబానికి చెందినది. ఆమె అందానికి, ఆమె నుండి వెలువడే కస్తూరి పరిమళానికి మహారాజు ఆకర్షితుడై మనసు పారేసుకుంటాడు. తనకి పుట్టే కుమారులే సింహాసనాన్ని అధిరోహించేలా మహారాజు నుండి వాగ్దానం తీసుకుని ఈమె మహారాజుని వరించింది.
గాంధారి
సుబల మహారాజు కుమార్తె గాంధారి. ఈమె యవ్వనం లో మహాశివుడిని పూజించింది. శివుడు ఆమె భక్తికి మెచ్చి నూరుగురు కుమారులు కలిగేలా ఆశీర్వదించాడు. ధృతరా ష్ట్రుడిని వివాహమాడిన గాంధారి భర్త గ్రుడ్డివాడని తెలియ గానే తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుని భర్త అడుగుజాడ ల్లో నడిచింది. తన భర్త కోసమని స్వచ్ఛందంగా కంటిచూప ుని జీవితాంతం త్యాగంచేసిన ఈమె మహాభారత అద్భుత మహిళలల్లో ఒకామె.
కుంతి
కుంతి మహాభారతంలో అందగత్తెలైన స్త్రీలలో ఒకరు. ఆమెకి వివాహానికి పూర్వమే సూర్యుని ద్వారా కర్ణుడు జన్మిం చాడు. కానీ ఆమె ఆటలాడుకుంటూ ఆకతాయితనం తో సూ ర్యుడిని పిలిచి కొడుకుని పొందింది. కానీ ఆ తరువాత ఈ చర్యవల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ట కలుగుతుందని భావించి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచి పెట్టేసింది.
అంబ
కాశీని పరిపాలించే మహారాజుకు ముగ్గురు కుమార్తెలు. అంబ, అంబిక, అంబాలిక. వారిలో అంబ పెద్ద కూతురు. మ హాభారతంలో అందమైన స్త్రీలలో ఒకరైన ఆమెకి ఆమె తండ్రి స్వయంవరాన్ని ఏర్పాటుచేసారు. ఆ సమయంలో మహారా జు భారతదేశంలోని మహారాజులందరికీ ఆహ్వానా లు పంపి హస్తినాపుర మహారాజుకి పంపడం మరిచిపోయా డు. ఇది చూసి ఆగ్రహించిన భీష్ముడు తన మేనళ్ళుడైన విచిత్రవీర్యు నికి అంబనిచ్చి పెళ్లి చేయదలచి అంబ, అంబిక, అంబాలిక ముగ్గురినీ అపహరించాడు. కానీ అప్పటికి స్వయంవరంలో తాను సాళ్వమహారాజుకి మనసిచ్చానని అంబ ధైర్యంగా తన ప్రేమని భీష్ముని ముందు వ్యక్తపరచడం చూస్తే ఆ కాల పరిస్థితులకి ఇది చాలా ధైర్యమైన చర్య అని చె ప్పవచ్చు.
ద్రౌపది
పాంచాలదేశపు మహారాజయిన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచినా చివరికి ఐదుగురు పాండవులకి ఉమ్మడి పత్ని అయి ‘పాంచా లి’ నామధేయురాలైంది. ద్రౌపది ఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఆమెని నిండు కౌరవసభలో వస్త్రాపహరణం సమ యంలో జరిగే అవమానం నుంచి కాపాడతాడు.
ఊర్వశి
దేవేంద్రుని దర్బారులో అందమైన నాట్యగత్తె. అర్జును ని మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించా లని చూసి భంగపడుతుంది. తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాల ని శపిస్తుంది. ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యం గా వ్యక్తపరచిన స్త్రీ ఊర్వశి.
సుభద్ర
బలరామ, శ్రీకృష్ణుల సోదరి. ఆమెని చూసి మోహించిన అర్జునుడు ఆమెని వివాహమాడాలనుకుంటాడు. బలరాము డు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనునికి సుభద్రని ఇవ్వాలను కుంటాడు. ఇది ఇష్టంలేని శ్రీకృష్ణుడు ఆమెని అపహరించి తీసుకెళ్లమని అర్జునునికి ఉపదేశిస్తాడు.
ఉలూపి
ఉలూపి అందమైన నాగకన్య. అర్జునుని మోహించి అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కొన్ని లేపనాల ద్వారా అర్జునుని స్పృహ కోల్పోయేట్లు చేసి అర్జునుని అపహ రించి అప్పుడు తన మనసుని అర్జునునికి తెలియ చేసింది.