Tuesday, November 26, 2024

నిన్ను నువ్వు పరిశీలించుకో (ఆడియోతో…)

కారు, దానిని నడిపించే డ్రైవరు ఎంత బాగున్నా కానీ ఆ కారును ఎప్పటికప్పుడు పరిశీలించకపోతే సమస్యలు వస్తాయి. అలాగే, ఒక క్షణం నువ్వు సంతోషంగా మరో క్షణం బాధగా ఉన్నావంటే ఏదో సమస్య ఉంది అని అర్థం. మనసు అనే వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మన సులోని ప్రవాహం చక్కగా ఉందా అని చూసుకో. అందులో పవిత్రత ఉందా? అందులో సత్యత ఉందా? అహానికి, స్వ అభిమానానికి ఏదైనా ఘర్షణ జరుగుతుంది? నేను ఇతరులకు ఎంత బాధను కలిగిస్తున్నాను? నా బలహీనతలు ఎక్కడ ఉన్నాయి? నేను ఎలా ఎదగగలను? వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఒక చక్కని రూపాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు. ఇందులో నిర్లక్ష్యము ఉంటే అది నీ వేగాన్ని తగ్గిస్తుంది. తుఫానులో చిక్కుకున్నట్లుగా, నీ జీవితం బోరు కొడుతుంది. కనుక, ఇందుకు బదులుగా, నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు మల్చుకుంటూ అన్నిటికీ సంసిద్ధంగా ఉండు. ధ్యానము చేసి శక్తిని, ప్రేమను పొందు. విశాల హృదయం రావడానికి నీకు నువ్వు టీచరుగా అవ్వు. ఇతరులకు సహకారాన్ని అందించడం ఎప్పుడూ మానకు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement