పుత్రుడు అంటే వారసుడు. తల్లిదండ్రుల గుణ గణాలను సంతరించుకున్నవాడు. జ్ఞానాన్ని పోలివున్న చతురత ను గ్రహంచినవాడు. కనుక పుత్రుడు ‘పున్నామ నరకం’ నుంచి తప్పిస్తాడు అంటారు. ‘పుత్రుడు’ అంటే శారీరక వారసుడు మాత్రమే కాదు, బుద్ధిపరమైన వారసుడు కూడా.
‘పున్నామ నరకం’ నుండి తప్పించేవాడు, వారసుడు అని ప్రతి తండ్రీ తన కొడుకుని ప్రేమగానే చూసుకుంటాడు కాని ఆ కొడుకులు మాత్రం 5 రకాలుగా ఉంటారు అని మన ధర్మ శాస్త్రాలు చెప్తున్నా యి. పుత్రులు అయిదు రకాలుగా వుండడం ఏమిటి? అనే సందేహం రావచ్చు. ఆ అయిదుగురు పుత్రులు ఎవరు? ఎలావుంటారో తెలుసుకుందాం.
శత్రు పుత్రుడు: ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనికి వ్యతిరేకిస్తూ, ఏ పనితోను తండ్రికి ఆనందం కలిగించక పోవడమే కాక తండ్రి మరణించే వరకు ప్రతి పనితోను తండ్రిని బాధిస్తూనే ఉంటాడు. గత జన్మలలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రు పుత్రుడిగా జన్మిస్తాడు. మిత్ర పుత్రుడు: ఇతడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహతుని వలె సంబంధాన్ని కొనసాగిస్తాడు కాని ఒక పుత్రుడు తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు. గత జన్మలలో ఆప్తమిత్రుడు ఐనవాడే ఈ జన్మలో మిత్ర పుత్రుడుగా జన్మిస్తాడు. సేవక పుత్రుడు : ఇతడు అన్ని విషయాలలోనూ రాణించకపోయినా తండ్రి చెప్పిన మాటని తుచ తప్పకుండా పాటిస్తాడు. తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు. తండ్రికి కేవలం సేవ చేయడానికి మాత్రమే జన్మిస్తాడు. పూర్వ జన్మలలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్దికి కృతజ్ఞ్యత పూర్వకంగా తన జీవితాంతం ఉండి ఈ జన్మలో సేవక పుత్రుడుగా జన్మిస్తాడు.
కర్మ పుత్రుడు: ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొర కు మాత్రమే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి తండ్రికి దూరంగానే ఉంటాడు. అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తండ్రికి దూరంగానే ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు. ఇతడిని కర్మ పుత్రుడు అంటారు.
నిజ పుత్రుడు : ఇతడు పుట్టిన దగ్గర నుంచి తన ప్రతి పనితోనూ తండ్రిని ఆనందింపచేస్తూ తండ్రికి అభేదంగా ఉంటాడు. ఇతడిని విడిచి తండ్రి క్షణ కాలం కూడా బ్రతుకలేడు. చివరికి తన అంత్యకాలమునందు కూడా తన కొడుకు చేతిలోనే సంతోషంగా ఏ బాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి ఒడిలోనే పొందుతాడు. మర్చిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెడ తాడు, గయలో శ్రార్ధం పెడతాడు. తండ్రికి పుణ్యలోకాలు కలిగేలా చేస్తాడు. ప్రతి క్షణం ప్రతి పనిలోనూ తన తండ్రినే స్మరిస్తాడు. అరమరికలు లేకుండా తండ్రి పోలికల తోటే ఉండి తండ్రిలాగే ప్రవర్తిస్తూ తండ్రి కోసమే బ్రతుకుతాడు. ఇతడిని మాత్రమే మన ధర్మశాస్త్రాలు నిజ పుత్రుడు అని పేర్కొంటున్నాయి.
– డా. చదలవాడ హరిబాబు, 9849500354
నిజమైన పుత్రులు ఎవరు
Advertisement
తాజా వార్తలు
Advertisement