రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మద్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురు చండాల యోగం, సర్ప భయాలు, రాహు, కేతు, కుజ దశ జరుగుతున్నప్పు డు వచ్చే దోషాలను, బాధలను తొలగించుకోవటా నికి మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం పఠించాలని బ్రహ్మవైవర్త పురా ణం చెబుతోంది. కశ్యప మహర్షి మానస పుత్రిక వాసుకి సోదరి జర త్కారువు అనే మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం గురు ముఖంగా ఉపదేశం పొంది పఠించాలి.
‘ఆస్తీక ఆస్తీక ఆస్తీక అని అనుకోండి.. పాములు మిమ్మల్ని ఏమీ చేయవు’ అని ఈనాటికీ పెద్దలు అంటుంటారు. ఆస్తీక అనే పేరు వింటే విషసర్పాలు ఏమీ చేయకుండా పక్కకు ఎందుకు తొలగిపో తాయి అనే విషయాల్ని వివరించే కథా సందర్భం ఇది.
పూర్వం జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మహారాజు మర ణానికి కారణమైన తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవటానికి సర్ప యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగాగ్నిలో సర్పాలు పడి సర్పజాతి నశించిపోసాగింది. వాసుకి ఈ విషయాన్ని తెలుసుకొని ప్రాణ భయంతో గజగజలాడిపోయాడు. అప్పటికే లక్ష లాది నాగ శ్రేష్ఠులు సర్పయాగాగ్నిలో పడి నశించి పోయారు.వాసుకి భయాన్ని ఆయ న సోదరి జరత్కారువు చూసింది. ఆమెకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. గతంలో ఆమె అన్న తన పేరే ఉన్న జరత్కారువు అనే మునికి తననిచ్చి వివాహం చేసింది సర్పజాతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే. వెంటనే ఆమె ఆ మునివల్ల తనకు జన్మించిన కుమారుడైన ఆస్తీ కుడిని పిలిచింది. ఆస్తీకుడు సర్పాల వినాశనానికి కద్రువ అనేవారి తల్లి శాప మే కారణ మని గ్రహించాడు. కానీ బ్రహ్మవరం కారణంగా జరత్కారువు అనే ఒకే పేరున్న ఇద్దరు దంపతులకు జన్మిం చిన బాలుడి వల్ల సర్ప వినాశనం ఆగిపోతుంది. అలా జన్మించింది తానే కనుక తన వల్లనే సర్ప యాగం ఆగిపోయి సర్పజాతికి మేలు కలగాలి. వెంటనే మేన మామ వాసుకికి ధైర్యంచెప్పి సర్పయాగాన్ని ఆపటానికి బయలు దేరాడు. ఆసీ ్తకుడు యజ్ఞ మండపంలోకి వెళుతుంటే ద్వారపాల కులు ఆపారు. ఆస్తీకుడు వారినేమీ అనకుండా యజ్ఞాన్ని, జనమే జయ మహా రాజును, రుత్విక్కులను, అగ్నిదేవుడిని స్తుతించాడు. దీంతో అందరూ ఆస్తీకుడికి ప్రసన్నమయ్యారు. వెంటనే రాజు ఏదై నా వరం కోరుకో అని అన్నాడు. తక్షకుడు యజ్ఞాగ్నికి ఆహుతి అయ్యేందుకు ప్రాణభయంతో వస్తున్న సమయంలో ఆస్తీకుడు జనమేజయ మహారాజును సర్పయాగాన్ని ఆపమని కోరాడు.
తక్షకుడు తన ప్రధాన శత్రువే అయినా జనమేజయుడు మాట ఇవ్వడంతో ఆస్తీకుడు యాగాన్ని ఆపా డు. స్తుతించిన వారికి మేలు జరగాలని రాజు దగ్గర వరం తీసుకొని ఆస్తీకుడు ఇంటికి వెళ్లి తల్లికి జరిగిందంతా చెప్పాడు. యాగంలో నశించిపోగా మిగిలిన సర్పా లన్నీ వచ్చి ఆస్తీకుడికి కృతజ్ఞతలు చెప్పి తమను కాపాడినందుకు ఏం చేయాలో చెప్పమని అడిగాయి.
ఆస్తీకుడు నాగులందరితో ”ప్రసన్న చిత్తంతో ఈ కథను చదివే వారెవరికీ నాగుల వల్ల ఎలాంటి భయమూ కలగకూడదు” అన్నా డు. నాగులన్నీ ఒప్పుకున్నాయి. ”ఎప్పుడైనా సరే జరత్కారువు అనే మునివల్ల జరత్కారువు అనే నాగకన్యకు జన్మించి, జనమేజ యుడి సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తీకుడిని నేను స్మరి స్తున్నాను. ఓ నాగులారా.. మీరు నన్ను హింసించకండి. మహాసర్ప మా ఇక్కడి నుంచి నన్నేమీ చేయకుండా తప్పుకొని వెళ్లిపో, జనమే జయుడి సర్పయాగ అంతకాలంలోని ఆస్తీకుడి మాటలను స్మరిం చు..’ ఇలా ఎవరైనా స్తుతి చేసినపుడు వారిని విడిచిపోతామని, తొల గిపోని సర్పం నశిస్తుందని నాగులన్నీ ఆస్తీకు డికి మాట ఇచ్చాయి. ఇలా ఆస్తీకుడు తన మాతృవంశం వారిని రక్షించి, వారివల్ల లోకోపకారకమైన తగిన వరం పొందాడు.
– డా|| చదలవాడ హరిబాబు
98495 00354
నాగదోష నివారణ స్తోత్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement