Tuesday, November 26, 2024

నవరాత్రుల్లో దుర్గమ్మ చెంతకు 5.75 లక్షల మంది భక్తులు

ఆదాయం రూ.4.08 కోట్లు
అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని 5.75లక్షల మంది దర్శించుకున్నట్లు ఆల య పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డీ.భ్రమ రాంబ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ.4.08కోట్లు ఆదాయం వచ్చిందని వారు పేర్కొన్నారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఆలయంలోని మహా మండపంలో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా ముగించామన్నారు. దసరా ఉత్సవాలతో పాటు మరో రెండు రోజుల పాటు వచ్చిన భవానీలకు 15.79లక్షల లడ్డూలు విక్రయించా మన్నారు. విలేకరుల సమావేశంలో స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement