Tuesday, November 26, 2024

నవరాత్రి రహస్యాలు (ఆడియోతో..)

తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

కాలో అశ్వోవహతి సప్తరస్మి
సహస్రాక్షో అజర భూరి రేతా
తమారోహంతి కవయో విపశ్చిత:
తస్య చక్రా భువనాని విశ్వా ||

అనగా కాలమనే అశ్వము ఏడు పగ్గములతో తనను తాను నియమించుకొనుచూ ప్రపంచమును మోయుచున్నది. ఈ కాలమునకు వేల వేల కన్నులు. ముదిమి లేని ఈ కాల ప్రభావము, బలము చాలా గొప్పవి. ఈ అశ్వమును పరమాత్మను సాక్షాత్కరించుకొనువారు, పరమాత్మ స్వరూపమును బోధించువారు అధిరోహించెదరు. ఈ అశ్వము పూన్చిన రథము యొక్క చక్రములే లేదా అశ్వ పాదములే అనంతకోటి బ్రహ్మాండములు.

స ఇమా విశ్వా భువనాని అంచ్యత్‌
కాలస్య ఈ యతే ప్రధమోనుదేవ:
సఏవ సంభువాన్యా నా భారత్‌
సఏవ సంభువానాని పరైత్‌
పితాసన్నభవత్‌ పుత్ర ఏషాం
తస్మాద్వై నాన్యత్‌ పరమస్తు తేజ:

ఆ కాల పురుషుడే ఈ అనంత భువనములను ఏర్పరిచెను. అందరు అన్ని ప్రాణులు మొదట తెలియునది కాల పురుషుడినే. అనంత కోటి బ్రహ్మాండములలో నిండి ఉన్నది ఈ కాలపురుషుడే. ఇన్ని భువనములను నడిపించువాడు వాటిలో తానుండి నడుచువాడు కాలపురుషుడే. ఒక్కప్పటి తండ్రే మరొక్కప్పుడు కొడుకు. ఒకప్పటి పుత్రుడే మరొకసారి తండ్రి. ఒకనాటి తాత మరోనాడు మనవడు అన్ని బంధుత్వాలు మరియు స్త్రీ,పురుషుడు, పశువు, చరాచరాలు అన్నీ కాలపురుషుడే . ఈ కాలమును మించినది మరొకటి లేదని పై మంత్రార్థము.

- Advertisement -

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement