Tuesday, November 26, 2024

నిరాకరణ

మనని మనం ఎంతగా భగవంతునికి సమర్పించుకుంటే అంత గాఢంగానూ ఆయన మన అనుభవంలోకి వస్తా డు. అలా అనిపించడము, స్ఫురించడము మాత్రమే గాక ప్రత్యక్షమైన సాక్షిగా అనుభూతమగును. ఎంత ఎక్కువగా మాన వుడు తనను తాను పరమాత్మకు ఇచ్చుకుంటే అంతంతగా మాన వులతో అతను ఉండును. మనము భుజిస్తున్నా, నిద్రిస్తున్నా, నడు స్తున్నా, ఆలోచిస్తున్నా, అన్నింటిలో ఎల్లప్పుడూ ఆ దైవం మన తోనే ఉంటాడు. అయితే ఆ స్థాయికి మన ము ఎదుగు టకు వ్యక్తిగత సాధన అత్యంత ఆవశ్యకము. దానికి శ్రీమాతారవిందులు ఆకాంక్ష. నిరాకరణ, సమర్పణ అనే త్రివిధ పురుష ప్రయత్నములను మనకు సూచించారు. క్రిందటి వారం ఆకాంక్ష గురించి తెలుసు కున్నాము. ఈ రోజు నిరాకరణ గూర్చి మనం చెప్పుకుందాం. నిరాకరణ అనగా నిమ్మ ప్రవృత్తి వృత్తులను నిరాకరించుట మానసిక భావములను, అభిప్రాయములను, అభిరుచులను, అల వాట్లను, నిర్మాణములను నిరాకరించవలయును. ఏ క్రియలు లేని నిశ్శబ్ద నీరవ మనస్సునందు సత్య జ్ఞానమునకు స్వేచ్ఛామయ అవకాశము లభించును. అలాగే ప్రాణిక స్వభావముల నిరాకరణ అనగా ప్రాణ ప్రకృతి యొక్క కామనలు, విషయ లంపటలు, అభ్యర్థనలు, ఆశలు, తృష్ణలు, భావములు, ఉద్రేకములు, సంవేదనలు, స్వార్ధము, అహంకారము, డాంబికములు, మోహము, లోభము, పేరాశలు, ఈర్శ్య, అసూయలు మున్నగువన్నియూ సత్య విరోధములు. వీటిని నిరాకరించడము చాలా అవసరము. అప్పుడు మాత్రమే యదార్థ బలము, సత్యశక్తి, ఆనందములు, ఊర్ధ్వము నుండి ప్రశాంత విశాల దృఢ నివేదితము అయిన ప్రాణిక సత్తాలోకానికి ప్రవహించగలు గుతాయి.

భౌతిక తత్త్వపు నిరాకరణ

భౌతిక ప్రకృతి యొక్క మౌఢ్యము, సంశయము, అవిశ్వాస ము, అజ్ఞానము, అల్పబుద్ధి, మొండితనము, సోమరితనము, మార్పుకు అయిష్టత, తమస్సును నిరాకరించవలయును. అలా చేసినప్పుడు దివ్య ప్రకాశము, శక్తి, ఆనందము సదా అధికాధిక ముగా దివ్యమవుతున్న శరీరమందు తమను సుస్థిరముగా ప్రతిష్టించగలుగుతాయి. అయితే పై నుండి సత్యము దిగివచ్చి నప్పుడు దానిని గ్రహించుటకు మనిషిలో తగినంత పవిత్రత, స్వేచ్ఛను కలిగి ఉండవలయును. తన ప్రకృతిలోని మాలిన్యము లను, దోషములను పరిహరించుకోవాలి. అపరా ప్రకృతి తాడింపులను, వేధింపులను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా నిరాకరించాలి.
అప్పుడే సత్యము మనలో పనిచేయడం ప్రారంభమగును. క్రమముగా మహాసత్యము మానవునిలో వృద్ధి పొందుతు న్న కొలది పైనుంచి దిగివచ్చు వెలుగు, స్వచ్ఛత, శక్తులకు సరి సమానముగా అతని ప్రకృతిని కూడా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళాలి. దానికి విరుద్ధమైన లక్షణాలను, ధోరణులను పూర్తిగా తిరస్క రించాలి. వాటికి ఏమాత్రం తావీయకూడదు. దీనికొరకు మానవుడు తననుతాను ప్రక్షాళన చేసుకుని, తీర్చిదిద్దుకొనుటకు ప్రథమ దశలో ప్రయత్నం చేయడం అంత్యక ఆవశ్యకము. మన వ్యక్తిత్వము మరియు మనలోని విభాగములన్నీ పరమాత్మ కొరకు తపిస్తూ, ఆయన మీదనే సంపూర్ణముగా దృష్టిని కేంద్రీకరించవలెను. దివ్య సత్యమునకు విరోధమైన ప్రతి లక్షణ మును మనలో నుండి బహిష్కరించాలి. ఈవిధమైన ప్రక్రియతో ఆలోచనలు, అనుభూతులు చేసే కర్మలన్నియూ దైవానికి ఆహుతి చేయబడతాయి. ఇక ఇప్పుడు మన జీవితం ఏ బంధనాలతో చిక్కుకోదు. మానసికంగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాము. ఏవిధమైన చీకూచింతా లేకుండా ఎల్లవేళలా జీవితం స్వర్గతుల్యముగా విరాజిల్లుతుంది.

– కవితా శ్రీధర్‌ , 9395511193

Advertisement

తాజా వార్తలు

Advertisement